Published : Jul 21, 2024, 11:51 AM ISTUpdated : Jul 21, 2024, 01:22 PM IST
Mohammed Shami-Sania Mirza : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ-భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే, సానియాగానీ, షమీ గానీ ఈ వార్తలు వచ్చిన ప్రారంభంలో స్పందించలేదు.
Mohammed Shami-Sania Mirza : భారత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంలో హాట్ టాపిక్ గా మారినప్పటీకీ షమీ గానీ, సానియా గానీ స్పందించలేదు. దీంతో ఈ ఇద్దరు మరో స్టార్ కపుల్ కాబోతున్నారనే టాపిక్ మధ్య మహమ్మద్ షమీ ఎట్టకేలకు సానియా తో తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై ఇప్పుడు స్పందించాడు.
24
Sania Mirza-Mohammed Shami
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి సానియా ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతి నుంచి షమీ-సానియా పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే శుభంకర్ మిశ్రాతో యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పుకార్లను తోసిపుచ్చాడు. ఇందులో వాస్తవం లేదనీ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.
34
సానియాతో పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై షమీ మాట్లాడుతూ.. "ఇది చాలా వింతగా ఉంది. కల్పిత వార్తలు.. బలవంతంగా వార్తలు వస్తున్నాయి. ఫోన్ ఓపెన్ చేస్తే ఫోటో కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం.. అయితే ఇలా ఎవరినీ ఇందులోకి లాగడం ఇష్టం లేదు.. ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీ సరదా కోసం మీమ్‌లు ఇలా చేస్తున్నారు.. కానీ అవి ఒకరి జీవితానికి సంబంధించినవని గుర్తుంచుకోండి" అని అగ్రహం వ్యక్తం చేశారు.
44
Mohammed Shami , shami
అలాగే, బాధ్యతాయుతంగా మీమ్స్ క్రియేట్ చేయాలనీ, ఒకరిని వివాదంలోకి లాగడం చేయవద్దన్నాడు. ''ఎవరినైనా గుంతలోకి నెట్టడం సులభంగానే ఉంటుంది.. అది కాదు.. కొంత సక్సెస్ చూపించండి. మీరే ఏదైనా సాధించండి. మీ స్థాయిని కొంచెం పెంచుకోండి. మీ కుటుంబాన్ని ఆదుకోండి. ఇతరులను అణగదొక్కడం కంటే బదులుగా ఒకరికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు మంచి వ్యక్తి అని నేను నమ్ముతాను'' అని పేర్కొన్నారు.