ICC T20 World Cup 2026 : టీమిండియా ఫామ్ ని చూసి పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టింది… అందుకే మ్యాచ్ ను బహిష్కరించిందని అందరికీ తెలుసు. ఇదే అభిప్రాయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కూడా వ్యక్తం చేశాడు.
ICC T20 World Cup 2026 : టీమిండియాను చూసి పాకిస్థాన్ భయపడుతోందా..? అందుకే టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుతో ఆడబోమని అంటోందా..? అంటే భారత అభిమానుల నుండి అవును అనే సమాధానమే వస్తుంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి... సాధారణంగానే టీమిండియాపై గెలవలేం... ప్రస్తుతం ఈ టీం అరివీర భయంకరంగా ఉంది కాబట్టి గెలుపు అసాధ్యం... ఆడి అవమానపడటం కంటే బహిష్కరించడమే మేలు అనుకుంటున్నట్లున్నారు పాక్ ఆటగాళ్లు. అందుకే ఏవేవో కారణాలు చెప్పి టీమిండియాతో టీ20 మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.
25
భారత్ తో ఆడకపోవడం పాక్ కే నష్టం
అయితే ఈ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం పాకిస్థాన్ కు చాలా కాస్ట్లీదిగా మారనుంది... డబ్బులే కాదు ప్రపంచ దేశాల ముందు పరువు తీసేలా ఉంది. ఈ మాట స్వయంగా ఓ పాకిస్థాని మాజీ క్రికెటర్ అంటున్నాడు. ''టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం మన క్రికెట్‌కే ఎక్కువ నష్టం చేస్తుంది'' అని మాజీ పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.
భారత్‌ను ఎదుర్కోవడానికి పాకిస్థాన్‌కు భయమనే తప్పుడు సంకేతాన్ని ఈ బహిష్కరణ నిర్ణయం ప్రపంచానికి పంపుతుందని కనేరియా అన్నాడు. భారత్‌లో అడుగు పెట్టబోమని పాకిస్థాన్ అంటేనే ఐసిసి శ్రీలంకలో మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు బహిష్కరణలో అర్థం లేదని కనేరియా అభిప్రాయపడ్డాడు.
35
టీమిండియాకు పాక్ భయపడుతోంది..
''భారత్‌ను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ భయపడుతోంది, అందుకే వారు ఆడటానికి నిరాకరిస్తున్నారని ప్రజలు అనుకోవడానికి ఇది కారణమవుతుంది. ప్రపంచకప్ అన్ని దశల్లోనూ భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ బహిష్కరణ పాకిస్థాన్ సెమీ ఫైనల్ అవకాశాలను మరింత కష్టతరం చేస్తుంది'' అని ఐఏఎన్ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా స్పష్టం చేశాడు.
''గ్రూప్ దశలో బహిష్కరిస్తారు సరే... కానీ రేపు సెమీ ఫైనల్ లేదా ఫైనల్‌లో భారత్‌ను ఎదుర్కోవాల్సి వస్తే... అప్పుడేం చేస్తారు. అప్పుడు కూడా ఇలాగే ఆడమని చెప్పి కిరీటాన్ని భారత్‌కు వదిలేస్తారా? మైదానంలోకి దిగి పోరాడి గెలవాలి. అదే అసలైన ప్రతీకారం. అంతేగానీ బహిష్కరించడం వల్ల ఎలాంటి మార్పు రాదు.'' అని కనేరియా చెప్పాడు.
55
భారత్ మ్యాచ్ బహిష్కరణ పాక్ క్రికెటర్లకు ఇష్టం లేదా..?
''టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్‌కు సపోర్ట్ ఇవ్వడానికే ఈ నిర్ణయం అని పాకిస్థాన్ అనుకోవచ్చు. కానీ ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకునే బదులు, తమ సొంత క్రికెట్ అభివృద్ధిపై వారు దృష్టి పెట్టాలి. భావోద్వేగంతో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. పాకిస్థాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఈ నిర్ణయంపై అసంతృప్తి ఉండి ఉంటుంది.. కానీ దాన్ని బయటకు చెప్పలేని పరిస్థితిలో వారు ఉన్నారు'' అని పాక్ మాజీ క్రికెటర్ కనేరియా అభిప్రాయపడ్డారు.