Cricket: భారత్ ను వదిలి తల్లిదండ్రులు వెళ్తే.. కొడుకు పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. 6 వికెట్లు పడగొట్టి.. తన సత్తా చాటాడు. మరి ఆ ప్లేయర్ ఎవరంటే.? మీరూ ఈ స్టోరీ చూసేయండి.
లాహోర్ టెస్ట్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ఆల్ రౌండర్ ఆరు కీలక వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ రెండో రోజు అనూహ్య రీతిలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రోజు 313 పరుగులు చేసిన తర్వాత, ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 178 పరుగులకే పరిమితమైంది.
25
సెనూరన్ ముత్తుసామి అద్భుత బౌలింగ్
పాకిస్తాన్ ఈ పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణం దక్షిణాఫ్రికా స్పిన్నర్ సెనురాన్ ముత్తుసామి. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ముత్తుసామి.. టెస్ట్ మొదటి రోజు ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్ వికెట్లు తీశాడు.
35
మొదటి రోజు నుంచి విధ్వంసం..
ముత్తుసామి తన బౌలింగ్‌లో మొహమ్మద్ రిజ్వాన్, నౌమాన్ అలీ, సాజిద్ ఖాన్‌లను పెవిలియన్ కు పంపి.. తన టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆపై షాహీన్ అఫ్రిది వికెట్‌తో ఆరు వికెట్లు పడగొట్టాడు. అలాగే భారత్‌తో ముత్తుసామికి ప్రత్యేక సంబంధం ఉంది.
డర్బన్‌లో ముత్తుసామి పుట్టి పెరగ్గా.. అతడి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. అతనికి 11 సంవత్సరాల వయసులో అతని తండ్రి మరణించాడు. ఆపై తల్లి ముత్తుసామిని పెంచింది. ముత్తుసామి ఎడమచేతి వాటం స్పిన్నర్ రంగన హెరాత్‌ను తన గురువుగా భావిస్తాడు. హెరాత్ ప్రభావం అతని బౌలింగ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
55
టెస్ట్ కెరీర్‌కు అద్భుతమైన ప్రారంభం
సెనురాన్ ఇప్పటివరకు కేవలం ఐదు టెస్టులు మాత్రమే ఆడాడు, ఆరో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాగే ముత్తుసామి మంచి బ్యాటర్ కూడా. ముత్తుసామి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 5,000 పరుగులు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించాడు.