Hardik Pandya : హార్దిక్-నటాషా మళ్లీ ఒక్కటవుతున్నారా..? అత్తవారింట్లో మాజీ కోడలు సందడి

Published : Apr 07, 2026, 02:21 PM IST

IPL 2026 లో హార్దిక్ పాండ్యా బిజీబిజీగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అతడి మాజీ భార్య న నటాషా అత్తవారింట్లో కనిపించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

PREV
14
అందరి దృష్టిని ఆకర్షించిన నటాషా పోస్ట్..

విడాకుల తర్వాత కూడా టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పకనే చెబుతూ నటాషా స్టాంకోవిచ్ ఒక రేర్ ఫొటో షేర్ చేసింది. కొడుకు అగస్త్య పాండ్యా పెంపకంపై ఇద్దరూ దృష్టి పెట్టారని ఈ పోస్ట్ హింట్ ఇస్తోంది. 

హార్దిక్ తో వివాహ బంధాన్ని తెంచుకున్న నటాషా కొడుకుకు తండ్రిప్రేమ దూరంకాకుండా జాగ్రత్త పడుతోంది.. ఇందుకోసం స్వయంగా అత్తవారింటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇలా హార్దిక్ తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నటాషా. 

24
మాజీ అత్తవారింట్లో నటాషా సందడి..

నటాషా స్టాంకోవిచ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఫ్యామిలీ ఫొటో షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇందులో తన మాజీ అత్తగారు అంటే హార్దిక్ తల్లి నలినీ పాండ్యాతో పాటు, కొడుకు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యులతో కనిపించారు. హార్దిక్ పాండ్యాతో విడిపోయాక ఇలా అందరూ కలిసి కనిపించడం ఇదే తొలిసారి. ఈ అనూహ్యమైన పోస్ట్ వెంటనే వైరల్ అయింది. ఇది వారి మధ్య ఉన్న గౌరవాన్ని, పరిణతిని చూపిస్తోందని చాలామంది భావిస్తున్నారు.  

అయితే అభిమానులేమో మళ్లీ హార్దిక్-నటాషా ఒక్కటి కాబోతున్నారని… కొడుకు కోసం వీరిద్దరు రాజీకి వస్తున్నారని… ఇందుకు ఈ ఫోటోయే నిదర్శనమని అంటున్నారు. అందులో భాగంగానే హార్దిక్ ఇంటికి నటాషా వెళ్లిందని అభిప్రాయపడుతున్నారు. ఇలా నటాషా అత్తవారింటికి వెళ్లడం ఆసక్తికర చర్చకు తెరతీసింది.

34
నటాషా లైఫ్ ఎలా సాగుతోంది..

విడాకుల తర్వాత నటాషా ఎక్కువగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటోంది. తన వ్యక్తిగత జీవితం, మాతృత్వంపైనే ఆమె దృష్టి పెట్టింది. తన సమయాన్ని కొడుకు అగస్త్య పెంపకానికే కేటాయిస్తూ, కొద్దిమంది స్నేహితులతోనే గడుపుతోంది. తాజాగా షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటో.. ఇద్దరూ విడిపోయినా, ఒకరిపై ఒకరు గౌరవం నిలుపుకున్నారని, ముఖ్యంగా కొడుకు పెంపకం విషయంలో కలిసి ఉన్నారని సూచిస్తోంది.

44
హార్దిక్ లైఫ్ లో కొత్త ప్రేమాయణం...

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ జనవరి 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వారికి కొడుకు పుట్టాడు. అయితే చాలాకాలం వీరిద్దరూ విడిపోతున్నారంటూ ప్రచారం జరిగింది… దీన్ని నిజం చేస్తూ జూలై 2024లో తాము అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

విడాకుల తర్వాత హార్దిక్ వ్యక్తిగత జీవితంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అతనికి మహికా శర్మతో సంబంధం ఉందని కథనాలు వస్తున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లతో సహా పలు మ్యాచ్‌లలో ఆమె హార్దిక్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించింది. హార్దిక్ తోనే కాదు అప్పుడప్పుడు అగస్త్యతో కూడా సమయం గడుపుతూ కనిపిస్తోంది మహికా. 

Read more Photos on
click me!

Recommended Stories