Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసి న్యూజిలాండ్ సెమీస్ చేరుకుంది. కీవీస్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ లోనే సెంచరీతో దుమ్మురేపాడు.
Champions Trophy 2025: రన్ మిషన్ అంటే ప్రపంచ క్రికెట్ లో మొదట గుర్తుకు వచ్చే పేరు భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు పరుగుల వరద పారాల్సిందే. అయితే, ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోకి కొత్త రన్ మిషన్ వచ్చేసింది. అతనే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర. ఐసీసీ టోర్నమెంట్లు అంటే దంచికొట్టే రచిన్.. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తనదైన ముద్ర వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.
రచిన్ రవీంద్ర ప్రస్తుతం పరుగుల వరదపారిస్తున్నాడు. 2023 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. రచిన్ రవీంద్ర ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. రచిన్ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడి సెంచరీ సాధించాడు. జట్టుకు విజయాన్ని అందించాడు.
34
11 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు కొట్టిన రచిన్ రవీంద్ర
ఐసీసీ టోర్నమెంట్‌లో రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2023 వన్డే ప్రపంచ కప్‌లో 10 మ్యాచ్‌లు ఆడాడు. మొదటి మ్యాచ్ నుండే గొప్ప ఫామ్‌లో కనిపించాడు. అక్కడ 3 సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. దీంతో ఐసీసీ ఈవెంట్లలో అతని సెంచరీల సంఖ్యను 4కు చేరింది. అతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలతో 690 పరుగులు చేశాడు.
44
Image Credit: Getty Images
మార్చి 2న భారత్ తలపడున్న న్యూజిలాండ్
బంగ్లాదేశ్‌పై రచిన్ రవీంద్ర 112 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 1 సిక్స్, 12 ఫోర్లు బాదాడు. అతని ఇన్నింగ్స్ తో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్‌కు ముందు, న్యూజిలాండ్ భారత్‌తో తలపడనుంది. దీంతో రచిన్ రవీంద్ర ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నాడు. ఆ మ్యాచ్‌లో ఏం చేస్తాడో చూడాలి. కాగా, ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రచిన్ రవీంద్ర రికార్డు సాధించాడు.