India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. పాకిస్తాన్ బౌలింగ్ ను చితక్కొడుతూ పరుగుల వరదపారించాడు.
India vs Pakistan: పాకిస్తాన్ ను బౌలింగ్ ను విరాట్ కోహ్లీ దంచికొట్టాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ లో బ్యాట్ తో పరుగుల వరద పారిస్తూ అత్యంత వేగంగా 14 వేల పరుగుల మార్కును అందుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతకుముందు ఫీల్డింగ్ లో కూడా అద్భుతం చేస్తూ లెజెండరీ ప్లేయర్ల రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ప్రపంచ రికార్డు సాధించాడు.
25
విరాట్ కోహ్లీ 2008లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు అందున్న భారత ప్లేయర్ గా రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత బౌలర్‌గా మహ్మద్ అజారుద్దీన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
35
Image Credit: Getty Images
భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో కోహ్లీ వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయ ఫీల్డర్ గా మొహమ్మద్ అజారుద్దీన్‌ను అధిగమించాడు. 2008లో అరంగేట్రం చేసినప్పటి నుండి, కోహ్లీ భారతదేశం తరపున వన్డేల్లో 158 క్యాచ్‌లు పట్టి, అజారుద్దీన్ 156 క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు.
45
Image Credit: Getty Images
కుల్దీప్ బౌలింగ్‌లో నసీమ్ షా క్యాచ్ తీసుకోవడంతో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత ఖుష్దిల్ షా కూడా క్యాచ్ రూపంలో విరాట్ కోహ్లీకి దొరికిపోయాడు. అత్యధిక క్యాచ్ లు తీసుకున్న ప్లేయర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 140, రాహుల్ ద్రవిడ్ 125, సురేష్ రైనా 102 క్యాచ్‌లతో ఉన్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో 96 క్యాచ్‌లు పట్టుకున్నాడు.