Champions Trophy Final: ఇండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ వర్షం పడితే..

Published : Mar 06, 2025, 04:48 PM IST

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 9వ తేదీ జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ ఆదివారం వర్షం పడితే ఏం జరుగుతుంది.? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
14
Champions Trophy Final: ఇండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ వర్షం పడితే..

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా, దక్షిణాఫ్రిక భారీ విజయాన్ని నమోదు చేసుకొని న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌లో ఉచితంగా చూసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలో చూడాలంటే మాత్రం కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిందే. 
 

24

నిజానికి అంతకు ముందు జియో సినిమాలో ఉచితంగా మ్యాచ్‌ చూసే అవకాశం ఉండేది. అయితే ఎప్పుడైతే జియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనమై జియోస్టార్‌గా మారిన తర్వాత ఉచిత సేవలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. దీంతో ఓటీటీలో మ్యాచ్‌ చూడాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే మ్యాచ్‌ను ఉచితం వీక్షించే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా.? ఇంతకీ మ్యాచ్‌ ఫ్రీ స్ట్రీమింగ్ ఆప్షన్‌ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

34

వెబ్‌సైట్‌ ద్వారా: 

* ఇందుకోసం మీకు యాక్టివ్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ ఉంటే చాలు. ముందుగా వెబ్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి 'firstball.in' అని టైప్‌ చేయాలి. 

* ఆ తర్వాత మొదట కనిపిస్తే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే ఏయే మ్యాచ్‌లు లైవ్‌లో ఉన్నాయో కనిపిస్తుంది. 

* 'వాచ్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే చాలు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా ఎంచక్కా ఉచితంగా మ్యాచ్‌లను చూడొచ్చు. అయితే ఇందులో మధ్య మధ్యలో యాడ్స్‌ వస్తుంటాయి. 

యాప్‌ కూడా:

అయితే యాడ్స్‌ లేకుండా ఉచితంగా మ్యాచ్‌లు వీక్షించాలనుకుంటే అందుకోసం కూడా ఒక యాప్‌ అందుబాటులో ఉంది. ఇందుకోసం ప్లే స్టోర్‌ నుంచి CRICFy TV అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏలాంటి యాడ్స్‌ లేకుండా మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు. 

44

వర్షం పడితే ట్రోఫీ ఎవరికీ.? 

మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం పడితే ఎలా అనే సందేహం రావడం సర్వసాధారణం. అందులోనూ ఫైనల్ మ్యాచ్‌ కావడంతో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం దుబాయ్‌లో ఆదివారం వర్షం పడే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటు వర్షం కురిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐసీసీ నింబంధనల ప్రకారం..  భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడితే, రిజర్వ్ డే ఏర్పాటు చేసుకునే నిబంధన ఉంది. దీనిలో ఆట మొదటి రోజు ఆగిపోయిన చోటు నుంచి రెండో రోజు ఆట ప్రారంభమవుతుంది. ఒకవేళ డీఎల్‌ఎస్‌ ఆధారంగా ఫలితాన్ని ప్రకటించాలంటే మ్యాచ్‌లో కనీసం 25 ఓవర్లు పడాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌ టై అయితే సూపర్‌ ఓవర్‌కు అవకాశం కల్పిస్తారనే విషయం తెలిసిందే. మరి ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఏం జరగనుంది.? ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ కానున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. 

click me!

Recommended Stories