NZ vs SA: సౌతాఫ్రికా ఇంటికి.. పైన‌ల్ కు న్యూజిలాండ్ !

Published : Mar 05, 2025, 10:51 PM IST

Champions Trophy 2025 NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విక్ట‌రీ అందుకుని ఫైన‌ల్ కు చేరింది.  

PREV
15
NZ vs SA: సౌతాఫ్రికా ఇంటికి.. పైన‌ల్ కు న్యూజిలాండ్ !
Image Credit: Getty Images

Champions Trophy 2025 semi-final NZ vs SA: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరులో త‌ల‌ప‌డేది ఎవ‌రో తెలిసిపోయింది. అవే ఒకవైపు టీమిండియా. మరోవైపు భార‌త జ‌ట్టుపై ప్ర‌తీకార జ్వాలతో రగిలిపోతున్న న్యూజిలాండ్. 

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 2న గ్రూప్ దశలో భారత్ కివీస్ జట్టును ఓడించింది. ఇప్పుడు రెండు జట్లు మార్చి 9న జరిగే ఫైనల్‌లో మరోసారి టైటిల్ కోసం పోరాడనున్నాయి. 

25

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు స్టార్లు అద్భుతమైన ఆట‌తో సెంచరీలు సాధించారు. రవీంద్ర 101 బంతుల్లో 108 పరుగులు చేయ‌గా, కేన్ విలియమ్సన్ 102 పరుగుల సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌ర‌లో గ్లెన్ ఫిలిప్స్ 49, డారిల్ మిచెల్ 49 ప‌రుగుల ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 362 ప‌రుగులు చేసింది.

35
Mitchell Santner

భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ చేతిలో 50 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. సౌతాఫ్రికా గెలుపుకోసం డేవిడ్ మిల్లర్ చివరి ఓవర్లలో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, జట్టు గెలిపించ‌లేక‌పోయాడు. చివరి బంతికి రెండు పరుగులు తీసి మిల్లర్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

డేవిడ్ మిల్లర్ 67 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో టెంబా బావుమా 56 ప‌రుగులు, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 69 ప‌రుగులు, ఐడెన్ మార్క్ర‌మ్ 31 ప‌రుగుల ఇన్నింగ్స్ లు ఆడారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ ఫైన‌ల్ కు చేరుకోగా, సౌతాఫ్రికా ఇంటికి ప‌య‌నం అయింది. 

45
Image Credit: Getty Images

ద‌క్షిణాఫ్రికాను త‌న బౌలింగ్ తో దెబ్బ‌కొట్టిన కెప్టెన్ మిచెల్ సాంట్నర్

అద్భుత‌మైన బ్యాటింగ్ తో భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు బౌలింగ్ లో కూడా అద‌ర‌గొట్టింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కీల‌క‌మైన వికెట్లు తీసుకున్నాడు.  టెంబా బావుమా (56), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (69), హెన్రిచ్ క్లాసెన్‌లను అవుట్ చేసి మ్యాచ్ ను కీవీస్ వైపు తీసుకువ‌చ్చాడు. మాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

55

ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్నింగ్స్‌లో సెంచరీ రికార్డులు 

2 - వీరేంద్ర సెహ్వాగ్ & సౌరవ్ గంగూలీ (IND) vs ఇంగ్లాండ్, కొలంబో, 2002
2 - క్రిస్ గేల్ & డ్వేన్ బ్రావో (WI) vs ఇంగ్లాండ్, అహ్మదాబాద్, 2006
2 - రికీ పాంటింగ్ & షేన్ వాట్సన్ (AUS) vs ఇంగ్లాండ్, సెంచూరియన్, 2009
2 - షకీబ్ అల్ హసన్ & మహ్మదుల్లా (BAN) vs న్యూజిలాండ్, కార్డిఫ్, 2017
2 - విల్ యంగ్ & టామ్ లాథమ్ (NZ) vs పాకిస్తాన్, కరాచీ, 2025
2 - రాచిన్ రవీంద్ర & కేన్ విలియమ్సన్ (NZ) vs దక్షిణాఫ్రికా, లాహోర్, 2025

Read more Photos on
click me!

Recommended Stories