NZ vs SA: సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎసరుపెట్టిన రచిన్ రవీంద్ర

Published : Mar 05, 2025, 11:24 PM IST

NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 50 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ర‌చిన్ ర‌వీంద్ర‌ సెంచ‌రీ కొట్టి స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుకు ఎస‌రుపెట్టాడు !  

PREV
15
NZ vs SA: సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎసరుపెట్టిన రచిన్ రవీంద్ర
Image Credit: Getty Images

Champions Trophy 2025 : ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో బుధవారం (మార్చి 5) లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్ - దక్షిణాఫ్రికా మధ్య జ‌రిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కీవీస్ యంగ్ ప్లేయ‌ర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీతో అద‌ర‌గొట్టాడు. రచిన్ రవీంద్ర 101 బంతుల్లో 108 పరుగులు చేసి అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

25
Rachin Ravindra breaks Sachin Tendulkar's record

శిఖ‌ర్ ధావ‌న్ రికార్డును బ్రేక్ చేసిన ర‌చిన్ ర‌వీంద్ర‌

ఐసీసీ టోర్నమెంట్లలో తన తొలి ఐదు వన్డే సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా ర‌చిన్ ర‌వీంద్ర రికార్డు సాధించాడు. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యంత వేగంగా ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా భారత మాజీ ఓపెన‌ర్ శిఖర్ ధావన్ రికార్డును కూడా ర‌చిన్ రవీంద్ర బద్దలు కొట్టాడు. ధావన్ ఈ ఘనతను సాధించడానికి 15 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, ర‌చిన్ రవీంద్రకు కేవలం 13 ఇన్నింగ్స్‌లలోనే ఐదు సెంచ‌రీలు బాదాడు.

35
rachin ravindra

న్యూజిలాండ్ ఓపెన‌ర్ గా ర‌చిన్ ర‌వీంద్ర సూప‌ర్ రికార్డు 

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలన సెంచరీతో రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రవీంద్రకు ఇది రెండో సెంచరీ. గాయం కారణంగా పాకిస్థాన్‌తో జరిగిన న్యూజిలాండ్ టోర్నమెంట్ ఓపెనర్ మ్యాచ్‌కు దూరమైన తర్వాత అతను బంగ్లాదేశ్‌పై 112 పరుగులు చేశాడు.

ఆ త‌ర్వాత భారత్‌తో జరిగిన చివరి గ్రూప్-దశ మ్యాచ్ లో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం ఆరు పరుగులకే వెనుదిరిగాడు, కానీ సెమీఫైనల్‌లో అత్యంత ముఖ్యమైన సమయంలో సెంచ‌రీతో ర‌చిన్ ర‌వీంద్ర సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికాపై సెంచ‌రీ త‌ర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఒకే ఎడిషన్‌లో ఒక‌టి కంటే ఎక్కువ సెంచ‌రీలు సాధించిన మొదటి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా ర‌చిన్ రవీంద్ర నిలిచాడు.

45

లెజెండ‌రీ ప్లేయ‌ర్ల ఎలైట్ క్ల‌బ్ లో చేరిన ర‌చిన్ ర‌వీంద్ర‌ 

సౌతాఫ్రికాపై సెంచ‌రీ సాధించిన త‌ర్వాత ర‌చిన్ ర‌వీంద్ర లెజెండ‌రీ ప్లేయ‌ర్ల ఎలైట్ గ్రూప్ లో చేరాడు. ఒకే టోర్నమెంట్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన క్రిస్ గేల్, సౌరవ్ గంగూలీ, సయీద్ అన్వర్, హెర్షెల్ గిబ్స్, ఉపుల్ తరంగ, షేన్ వాట్సన్, శిఖ‌ర్ ధావన్ వంటి దిగ్గజాల ప్రత్యేక‌ జాబితాలో ర‌చిన్ చేరాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ, ప్ర‌పంచ కప్ సెంచరీల ఎలైట్ క్లబ్‌లో రచిన్ రవీంద్ర చేరాడు. 25 సంవత్సరాల 107 రోజుల వయసులో, రవీంద్ర ఇప్పుడు ఐదు వన్డే సెంచరీలు సాధించిన రెండవ అతి పిన్న వయస్కుడైన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్, 24 సంవత్సరాల 165 రోజుల వయసులో ఈ మైలురాయిని చేరుకున్న కేన్ విలియమ్సన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచాడు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్ సెంచరీలు సాధించిన ప్లేయ‌ర్ల‌ ఎలైట్ క్లబ్‌లో చేరాడు.

55

ఐసీసీ టోర్నీల‌లో సెంచ‌రీల మోత మోగిస్తున్న ర‌చిన్ ర‌వీంద్ర‌ 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ,  వన్డే ప్రపంచ కప్ రెండింటిలోనూ రెండు కంటే ఎక్కువ సెంచ‌రీల‌తో మ‌రో ఘ‌న‌త సాధించాడు ర‌చిన్ ర‌వీంద్ర‌. అత‌ను 2023 వన్డే ప్రపంచ కప్‌లో మూడు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు అతను ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు.

దీంతో ర‌చిన్ రవీంద్ర రెండు ఈవెంట్లలో ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. సౌరవ్ గంగూలీ 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు సెంచరీలు, 2003 ODI ప్రపంచ కప్‌లో మరో మూడు సెంచరీలు సాధించాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ, 2011 వన్డే ప్రపంచ కప్‌లో ఉపుల్ తరంగ రెండు సెంచరీలు సాధించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 ప్రపంచ కప్‌లో రెండు సెంచరీలతో శిఖర్ ధావన్ కూడా ఈ ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. అలాగే, ర‌చిన్ ర‌వీంద్ర స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును స‌మం చేశాడు. 30 ఏళ్లు నిండే ముందు 50 ఓవర్ల ICC టోర్నమెంట్లలో సచిన్ టెండూల్కర్ ఐదు సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories