BCCI: బీసీసీఐకి బిగ్ షాక్.. ఐపీఎల్, కోచ్చి టస్కర్స్‌ కేరళ జట్టు వివాదం ఏమిటి?

Published : Jun 18, 2025, 09:24 PM IST

BCCI Kochi Tuskers controversy: బాంబే హైకోర్టు కోచ్చి టస్కర్స్‌ కేరళ జట్టుకు రూ.538 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. ఐపీఎల్ లో కోచ్చి టస్కర్స్-బీసీసీఐ వివాదం ఏమిటి? కోర్టు ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
బీసీసీఐ-కోచ్చి టస్కర్స్ కేరళ వివాదం

BCCI Kochi Tuskers controversy: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ కేరళ జట్టు కోచ్చి టస్కర్స్ కు రూ.538 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మధ్యవర్తిత్వ ప్యానల్ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు బుధవారం (జూన్ 18, 2025) సమర్థించింది. న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఐ చాగ్లా ఈ తీర్పును వెలువరించారు.

బీసీసీఐ-కోచ్చి టస్కర్స్ వివాదం ఎక్కడ మొదలైంది?

కోచ్చి టస్కర్స్ కేరళ జట్టును బీసీసీఐ 2011 సెప్టెంబరులో ఐపీఎల్ నుంచి తొలగించింది. ఆ జట్టు యాజమాన్యం రూ.156 కోట్ల వార్షిక బ్యాంకు గ్యారంటీని సమర్పించలేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది బీసీసీఐతో ఉన్న ఒప్పందంలోని నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది.

అయితే, బీసీసీఐ అప్పట్లో జట్టును కొనసాగించాలని కొంతమంది సభ్యులు సిఫార్సు చేసినా, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మానోహర్ ఈ సలహాలను విస్మరించారు. ఐపీఎల్ నుంచి కేరళ జట్టు కోచ్చి టస్కర్స్ పూర్తిగా తొలగించారు.

26
బీసీసీఐ-కోచ్చి టస్కర్స్ వివాదం: మధ్యవర్తిత్వ ప్రక్రియకు దారి

జట్టు యాజమాన్యం అయిన రెన్డెజ్‌వూస్ కన్సార్టియం, కోచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (KCPL) లు బీసీసీఐ చర్యను సవాల్ చేస్తూ 2012లో మధ్యవర్తిత్వ ధరణిలోకి వెళ్లింది. 2015లో మధ్యవర్తిత్వ న్యాయస్థానం జట్టుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు ప్రకారం KCPLకు లాభనష్టాలకుగాను రూ.384 కోట్లు, బ్యాంకు గ్యారంటీ అక్రమ రద్దుకుగాను RSWకు రూ.153 కోట్లు కలిపి రూ.538 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా వడ్డీ, న్యాయ ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంది.

బీసీసీఐ సవాల్ తో మళ్లీ వివాదం

ఈ తీర్పును బీసీసీఐ సవాల్ చేసింది. మధ్యవర్తి తన అధికారాలను మించిపోయాడని పేర్కొంది. అలాగే, న్యాయ సూత్రాలను సరైన విధంగా అన్వయించలేదని బీసీసీఐ వాదనలు చేసిందతి. అలాగే, KCPL గ్యారంటీ సమర్పించకపోవడం ఒక ప్రధాన ఒప్పంద ఉల్లంఘన అని పేర్కొంది. దీంతో పాటు, రెన్డెజ్‌వూస్ క్లెయిమ్‌కు భారత పార్ట్‌నర్‌షిప్ చట్టం ప్రకారం స్థానం లేదని పేర్కొంది.

36
బీసీసీఐ-కోచ్చి టస్కర్స్ వివాదం: న్యాయస్థానం తాజా తీర్పు

బీసీసీఐ-కోచ్చి టస్కర్స్ వివాదం మధ్యవర్తిత్వాన్ని బీసీసీఐ సవాల్ చేయడంతో మరోసారి ఈ అంశం హైకోర్టుకు చేరింది. అయితే, బీసీసీఐ వాదనలను కోర్టు పట్టించుకోలేదు. న్యాయమూర్తి ఆర్‌ఐ చాగ్లా బీసీసీఐ వాదనలను తోసిపుచ్చారు. "అర్బిట్రేషన్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం ఈ కోర్టుకు పరిష్కార హక్కు చాలా పరిమితంగా ఉంది. మధ్యవర్తి చేసిన తార్కిక నిర్ణయాలపై ఈ కోర్టు అప్పీలేట్ బాడీలా వ్యవహరించదు" అని తీర్పులో పేర్కొన్నారు.

న్యాయస్థానం ప్రకారం, బీసీసీఐ తరచూ సంభాషణల ద్వారా గ్యారంటీ సమర్పణ గడువును స్వయంగా వదులుకున్నట్లే. దీంతో, 2012 సీజన్‌కు గ్యారంటీ సమర్పించాల్సిన అవసరం లేదన్న మధ్యవర్తి అభిప్రాయాన్ని తప్పుగా చెప్పలేమని స్పష్టం చేసింది. కోచ్చి టస్కర్ జట్టుకు నష్టపరిహారం చెల్లించాలని సూచించింది.

46
ఐపీఎల్ లో కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు చరిత్ర

కోచ్చి టస్కర్స్ కేరళ జట్టు 2011లో మాత్రమే ఐపీఎల్‌లో పాల్గొంది. ఈ ఎడిషన్ లో కోచ్చి టస్కర్స్ జట్టు ఎనిమిదవ స్థానంలో టోర్నీని ముగించింది. జట్టు ఓనర్లు వ్యాపార సంస్థల సమూహమైన రెన్డెజ్‌వూస్ కన్సార్టియం. బ్రెండన్ మెకల్లమ్, ముత్తయ్య మురళీధరన్, మహేల జయవర్ధన, ఎస్ శ్రీశాంత్, బ్రాడ్ హాజ్ వంటి ప్రముఖులు జట్టులో ఉన్నారు.

ఇటీవల జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (కోచ్చి), ఇంతకుముందు వారి హోమ్ గ్రౌండ్, ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్‌కి ఫుట్‌బాల్ స్టేడియంగా ఉపయోగపడుతోంది.

ఐపీఎల్‌లో బీసీసీఐకి పెద్ద నష్టం

ఈ తీర్పుతో బీసీసీఐకి భారీ ఆర్థిక నష్టం తప్పదు. రూ.538 కోట్ల నష్టపరిహారంతో పాటు వడ్డీ, న్యాయ వ్యయాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పుణె వారియర్స్‌తో కూడా బీసీసీఐకి ఒప్పంద రద్దు కారణంగా వివాదం తలెత్తింది. ఈ కేసు భారత క్రీడా పాలనలో ఒప్పంద నిబంధనల ప్రాముఖ్యత, పారదర్శకతపై చర్చకు దారితీసింది. మధ్యవర్తిత్వ తీర్పులపై కోర్టులు హస్తక్షేపం చేయకూడదనే భావన ఈ కేసుతో మరింత బలపడింది.

56
బీసీసీఐ - ఐపీఎల్ జట్ల వివాదం ఇదే మొదటికి కాదు

ఒక ఫ్రాంచైజీ తొలగింపుపై చట్టపరమైన వివాదం ఏర్పడటం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఇది మొదటి సారి కాదు. తాజాగా కోచ్చి టాస్కర్స్ కేరళను తొలగించిన అంశంపై చర్చలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అయితే ఇది అంతకుముందు జరిగిన ఇతర ఘనమైన కేసుల్లో ఒకటి మాత్రమే.

దక్కన్ చార్జర్స్ తొలగింపు.. న్యాయపరమైన పరిణామాలు

2012లో బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) దక్కన్ చార్జర్స్‌ను ఆర్థిక లోటు కారణంగా ఐపీఎల్ నుండి తొలగించింది. ఈ తొలగింపు పై అప్పట్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. తర్వాత వివాదం న్యాయస్థాయిలోకి వెళ్లగా, ఆర్భిట్రేటర్ దక్కన్ చార్జర్స్‌కు అన్యాయంగా తొలగించారని తేల్చి రూ.4,814 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలనే తీర్పు ఇచ్చారు.

అయితే, ఈ తీర్పును 2021లో బాంబే హైకోర్టు కొట్టివేసింది. కోర్టు బీసీసీఐకి ఉన్న బాధ్యతను రూ.34 కోట్లు (బ్యాంకు వడ్డీతో కలిపి)గా పరిమితం చేసింది. దీనితో దక్కన్ చార్జెస్ ఫ్రాంచైజీకి భారీ నష్టం జరిగిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

66
బీసీసీఐ - ఐపీఎల్ పుణె వారియర్స్ ఇండియా కేసు

ఇలాంటి మరో సంఘటన 2013లో చోటు చేసుకుంది. సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ జట్టు పుణె వారియర్స్ ఇండియా. బీసీసీఐకి రూ. 170.2 కోట్ల బ్యాంకు గ్యారంటీ సమర్పించకపోవడంతో ఫ్రాంచైజీని తొలగించారు. ఈ అంశం కూడా చట్టపరమైన దశకు చేరుకుంది.

ఈ రెండు సందర్భాల్లోనూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు పెద్ద మొత్తంలో నష్టపరిహారాల అంశాలకు దారి తీసినప్పటికీ, ఐపీఎల్‌కు వ్యాపారపరమైన ప్రభావం పెద్దగా కనిపించలేదు.

ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరుగుతూనే ఉంది

ఈ విధమైన వివాదాలు ఉన్నా ఐపీఎల్ వాణిజ్యపరంగా వృద్ధిపథంలో కొనసాగుతోంది. 2024లో బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన నివేదిక ప్రకారం, ఐపీఎల్ మొత్తం బ్రాండ్ విలువ గత ఏడాదితో పోల్చితే 13% పెరిగి $12 బిలియన్లకు చేరింది. 2009లో ఐపీఎల్ విలువ కేవలం $2 బిలియన్‌గా ఉన్నప్పటికీ, 2023లో అది $10 బిలియన్‌ మార్క్‌ను దాటి, 2024లో మరింతగా అభివృద్ధి చెందింది.

ఇది ప్రపంచంలోని అతిపెద్ద టీ20 లీగ్‌గా మాత్రమే కాకుండా, అమెరికాలోని శతాబ్ద కాలం నాటి నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తరువాత రెండవ అతిపెద్ద క్రీడా లీగ్‌గా గుర్తింపు పొందింది.

Read more Photos on
click me!

Recommended Stories