U19 World Cup: భారత అండర్ -19 జట్టు అండర్ -19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ లోకి 5వ సారి దూసుకెళ్లింది. సెమీ-ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఉదయ్ సహారన్-సచిన్ దాస్ జోడీ సూపర్ ఇన్నింగ్స్ తో ప్రపంచ రికార్డు సృష్టించింది.
U19 World Cup: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2024 లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో భారత్ మరోసారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత అండర్-19 క్రికెట్ జట్టు 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు వరుసగా ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో యంగ్ ఇండియా ప్లేయర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
26
Uday Saharan-Sachin Dhas
భారత అండర్ -19 జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ ఐదోసారి 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అండర్-19 క్రికెట్ లో ఐదో వికెట్ కు అతిపెద్ద భాగస్వామ్యంగా సహారన్-సచిన్ దాస్ జోడీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
36
ఈ క్రమంలోనే దిగ్గజ క్రికెటర్ల వెనక్కి నెట్టారు. ఉదయ్ సహారన్, సచిన్ దాస్ జోడీ ఐదో వికెట్ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ జోడీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. బంగ్లాదేశ్ కు చెందిన తౌహిద్ హ్రిడో, షమీమ్ హుస్సేన్ ఐదో వికెట్ కు 161 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు భారత్ జోడీ వారి రికార్డును బ్రేక్ చేసింది.
46
Sachin Dhas and Saharan
అదే సమయంలో భారత్ నుంచి అంతకుముందు ఐదో వికెట్ కు అతిపెద్ద భాగస్వామ్యంగా సర్ఫరాజ్ ఖాన్, రికీ భుయ్ పేరిట రికార్డు నమోదైంది. సర్ఫరాజ్ ఖాన్, భుయ్ ఐదో వికెట్ కు 159 పరుగులు జోడించారు. ఇప్పుడు ఉదయ్, సచిన్ జోడీ ఈ రెండు జంటలను అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
56
U19 india, U19WorldCup, India, cricket
దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ లో ఉదయ్ సహారన్ (81), సచిన్ దాస్ (96) అద్భుత ఇన్నింగ్స్ తో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్లో భారత జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
66
U19 india, U19WorldCup, India, cricket
బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ లేదా ఆస్ట్రేలియా మ్యాచ్ విన్నర్ తో భారత్ తలపడనుంది.