Virat Kohli: విరాట్ కోహ్లీతో జాగ్రత్త.. దక్షిణాఫ్రికాకు ఏబీ డివిలియర్స్ వార్నింగ్

Published : Dec 04, 2023, 05:11 PM IST

AB De Villiers: ఈ నెల‌లో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత స్టార్ బ్యాట‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు టెస్ట్ మ్యాచ్ ఆడ‌బోతున్నారు. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీతో జాగ్ర‌త్త అంటూ ఏబీ డివిలియ‌ర్స్ వార్నింగ్ ఇచ్చాడు.    

PREV
16
Virat Kohli: విరాట్ కోహ్లీతో జాగ్రత్త.. దక్షిణాఫ్రికాకు ఏబీ డివిలియర్స్ వార్నింగ్

South Africa Vs India Test series: సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీని నుంచి భారీ ఇన్నింగ్స్ ను చూడాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భార‌త్ ఈ ప‌ర్య‌ట‌న‌లో రెండు టెస్టుల‌తో పాటు మూడు టీ20, మూడు వ‌న్డే మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది. 

 

26

డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న వైట్ బాల్ మ్యాచ్ ల‌ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీలకు విశ్రాంతినిచ్చారు. భారత టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నారు.

36

తొలి టీ20 డర్బన్ లో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్ లు డిసెంబర్ 12న గ్కెబెర్హా, డిసెంబర్ 14న జోహన్నెస్ బ‌ర్గ్ లో జ‌రుగుతాయి. డిసెంబర్ 17 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 19న గ్కెబెర్హాలో, ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 21న పార్ల్ లో జరగనున్నాయి.

46
Virat Kohli Bowling

గాంధీ-మండేలా ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రీడమ్ సిరీస్ తో ఈ పర్యటన ముగుస్తుంది. ఈ రెండు మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రానున్నారు. డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ లో తొలి టెస్టు, జనవరి 3 నుంచి జనవరి 7 వరకు కేప్ టౌన్ లో రెండో టెస్టు జరగనుంది.

56

'దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనను చూస్తాం. ఈ సిరీస్ లో అతను తన దూకుడు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అతను పెద్ద ఆటగాడు కాబట్టి, భారత జట్టు మొత్తం ప్రపంచ స్థాయి కాబట్టి దక్షిణాఫ్రికా విరాట్ కోహ్లీ విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి' అని ఏబీ డివిలియర్స్ అన్నాడు.

 

66
Virat Kohli

సౌతాఫ్రికా సిరీస్ కు భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ. సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్. షమీ, జస్ప్రీత్ బుమ్రా (వీసీ), ప్రసిద్ధ్ కృష్ణ.

Read more Photos on
click me!

Recommended Stories