New Zealand vs Bangladesh: విలియ‌మ్స‌న్ సెంచ‌రీ వృధా.. కివీస్ పై బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక విజ‌యం

First Published | Dec 2, 2023, 4:15 PM IST

Zealand vs Bangladesh: 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లు పడగొట్టడంతో కివీస్ జ‌ట్టు 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో స్వదేశంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం సాధించింది. 
 

New Zealand vs Bangladesh: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ సొంతగడ్డపై టెస్టుల్లో ఇదే తొలి విజయం. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ సిల్హెట్‌లో జరిగింది.
 

గత 24 నెలల్లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు రెండోసారి విజయం సాధించింది. అంతకుముందు బంగ్లాదేశ్‌ గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
 

Latest Videos


సిల్హెట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ త‌న బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. తన కెరీర్ లో 29వ సెంచరీ సాధించాడు. దీంతో టెస్టు క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, డాన్ బ్రాడ్‌మ‌న్ ల‌ను స‌మం చేశాడు. 

అయితే, ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతితో న్యూజిలాండ్ ఓడిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ కివీస్ జ‌ట్టు 181 పరుగులకే ఆలౌటైంది. తైజుల్ ఇస్లాం కివీస్ జ‌ట్టును దెబ్బ‌కొట్టాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో 6, మొత్తంగా 10 వికెట్లు తీసుకున్నాడు. 
 

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో సెంచరీతో చెల‌రేగాడు. 198 బంతుల్లో 105 పరుగులతో రాణించి బంగ్లా గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. 

నజ్ముల్ హుస్సేన్ శాంటోతో పాటు ముష్ఫికర్ రహీమ్ కూడా 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మెహదీ హసన్ మిరాజ్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 332 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అయితే, 181 ప‌రుగుల‌కే కివీస్ జ‌ట్లు కుప్ప‌కూలింది. 
 

click me!