Shai Hope: ఇంగ్లాండ్ పై విండీస్ కెప్టెన్ సూప‌ర్ సెంచరీ.. కోహ్లీ, రిచ‌ర్డ్‌స‌న్ స‌ర‌స‌న షాహ్ హోప్

First Published | Dec 4, 2023, 1:36 PM IST

West Indies vs England: మూడు వన్డేల సిరిస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జ‌రిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ షాయ్ హోప్ తన 16వ వన్డే సెంచరీని నమోదు చేసి స‌రికొత్త రికార్డులు సృష్టించాడు. 
 

WI vs ENG: విండీస్ కెప్టెన్ షాహ్ హోప్ త‌న సూప‌ర్ సెంచరీతో విరాట్ కోహ్లీ, రిజ‌ర్డ్ స‌న్ రికార్డుల‌ను స‌మం చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో విండీస్ కెప్టెన్ షాహ్ హోప్ అద్భుత సెంచరీతో మెరిశాడు. దీంతో ఆతిథ్య జట్టు 4 వికెట్లు, 7 బంతులు మిగిలి ఉండగానే 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
 

ఈ క్రమంలోనే హోప్ వన్డే క్రికెట్లో 5000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 114 ఇన్నింగ్స్ లో 51 సగటుతో 16 సెంచరీలు, 24 అర్ధసెంచరీలతో 5049 పరుగులు చేశాడు.
 

Latest Videos


షాహ్ హోప్ 114 ఇన్నింగ్స్ లో 5000 పరుగుల మైలురాయిని చేరుని, ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ తో సమానంగా నిలిచాడు. బాబర్ అజామ్, హషీమ్ ఆమ్లా మాత్రమే అతని కంటే ముందు వరుసలో ఉండటంతో ఈ మైలురాయిని అధిగమించి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.
 

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ వన్డేల్లో కేవలం 97 ఇన్నింగ్స్ లోనే 5000 పరుగుల మైలురాయిని అందుకోగా, ఆసీమ్ ఆమ్లా 101 ఇన్నింగ్స్ ల‌లో ఈ ఘనత సాధించాడు.

అతి త‌క్కువ ఇన్నింగ్స్ లోనే 5 వేల ప‌రుగుల చేసిన టాప్-5 ఆట‌గాళ్ల జాబితా గ‌మ‌నిస్తే.. బాబార్ అజాం 97 ఇన్నింగ్స్ లో, హ‌షీమ్ ఆమ్లా 101 ఇన్నింగ్స్ లో, విరాట్ కోహ్లీ 114 ఇన్నింగ్స్ లో ఐదు వేల ప‌రుగులు చేశారు. అలాగే, వివ్ రిచ‌ర్డ్స్ 114, షాహ్ హోప్ కూడా 114 ఇన్నింగ్స్ లో వ‌న్డేలో 5 వేల ప‌రుగులు చేశారు. 
 

వన్డేల్లో అత్యంత వేగంగా 16 సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడిగా కూడా షాహ్ హోప్ నిలిచాడు. బాబర్ ఆజమ్(84), హషీమ్ ఆమ్లా(94)  వ‌రుస‌గా టాప్ రెండు స్థానాల్లో ఉన్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో 110 ఇన్నింగ్స్ లో 16 సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్ తో కలిసి కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
 

ఇక విండీస్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే ఫిల్ సాల్ట్ (45), విల్ జాక్స్ (26) ఓపెనింగ్ జోడీ 71 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం అందించారు. జోస్ బట్లర్ జోరు కొనసాగడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌటైంది. త‌ర్వాత బ్యాటింగ్ కు దిగిన విండీస్ కూడా తమ తొలి జోడీ అలీక్ అథనాజ్, బ్రాండన్ కింగ్ 18 ఓవర్లలోనే 104 పరుగులు జోడించారు.
 

ఓపెనర్లు ఇద్ద‌రు ఈ త‌ర్వాత ఔటవ్వడంతో షాహ్ హోప్ నాలుగు పరుగుల వద్ద బ్యాటింగ్ కు వచ్చి చివరి వరకు క్రీజులో ఉండేలా చూసుకున్నాడు. రొమారియో షెపర్డ్ 28 బంతుల్లో 49 పరుగులతో రాణించడంతో కరీబియన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

click me!