విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలపై కొత్త రచ్చ.. జైషా ఏం చెప్పాడో తెలుసా?

First Published | Aug 16, 2024, 9:42 PM IST

Virat Kohli-Rohit Sharma : భారత క్రికెట్ నియంత్రణ మండ‌లి (బీసీసీఐ) ఈ సంవత్సరం త‌మ క్రికెట‌ర్ల‌కు సంబంధించి అనేక నియమాలను రూపొందించింది. ఈ క్ర‌మంలో దేశవాళీ క్రికెట్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేన‌ని బోర్డు స్పష్టం చేసింది.
 

rohit virat

Virat Kohli-Rohit Sharma : భార‌త క్రికెట‌ర్లు ఇత‌ర లీగ్ మ్యాచ్ ల‌లో ఆడ‌టం పై ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్న త‌రుణంలో దేశ‌వాళీ క్రికెట్ ను దృష్టింలో ఉంచుకుని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అనేక రూల్స్ తీసుకువ‌చ్చింది. అందులో ఒకటిి భార‌త ప్లేయ‌ర్లు త‌ప్ప‌కుండా దేశ‌వాళీ టోర్నీల‌లో ఆడాల్సిందే. అంటే రంజీ ట్రోపీ, దులీప్ ట్రోపీ ఇలా బీసీసీఐ నిర్వ‌హించే దేశ‌వాళీ టోర్నీల‌లో మ‌న ప్లేయ‌ర్లు ఆడాల్సిందే. వారికి మాత్ర‌మే జాతీయ జ‌ట్టులో చోటు ఉంటుంది. జాతీయ జ‌ట్టు షెడ్యూల్ లేన‌ప్పుడు టీమ్ లోని ప్లేయ‌ర్లు కూడా దేశ‌వాళీ టోర్నీల్లో పాల్గొనాలి. తాజాగా దులీప్ ట్రోఫీకి బీసీసీఐ ప్లేయ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే భార‌త స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల గురించి ర‌చ్చ మొద‌లైంది. 

ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిందేనని బోర్డు స్పష్టం చేయగా, ఒక‌వేళ ఆటగాడు గాయపడితే తిరిగి జ‌ట్టులోకి తిరిగి రావాలంటే దేశ‌వాళీ క్రికెట్ ఆడాల్సిందే. దేశవాళీ మ్యాచ్‌ల్లో ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మళ్లీ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోగలుగుతారు. ఈ విష‌యంలో ఇదివ‌ర‌కు ఇషాన్ కిష‌న్, శ్రేయాస్ అయ్య‌ర్, కృనాల్ పాండ్య స‌హా ప‌లువురు ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 


సీనియర్‌ జట్టుకు దూరమైన ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. అయితే, ఇప్పుడు టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు ఇందులో మినహాయింపు లభించింది. ఇద్దరు ఆటగాళ్లు దులీప్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో బీసీసీఐ పై తీవ్ర విమర్శలు వ‌స్తున్నాయి. బోర్డు నిబంధనలు ఆటగాళ్లందరికీ ఒకేలా ఉండాలని కొందరు అన్నారు. దీంతో రోహిత్ శ‌ర్మ‌-విరాట్ కోహ్లీలు టార్గెట్ గా మారారు. క్రికెట్ వ‌ర్గాల్లో ఇప్పుడు ఇదే ర‌చ్చ న‌డుస్తోంది. ఈ వివాదం మ‌రింత ముదిరే విధంగా క‌నిపిస్తున్న క్ర‌మంలో బీసీసీఐ సెక్రటరీ జై షా సమాధానమిస్తూ అందరి నోళ్లను మూయించారు.

జై షా మాట్లాడుతూ.. ''విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు భారత క్రికెట్‌కు ఎంతో చేశారు. దులీప్ ట్రోఫీ లాంటి టోర్నీలు ఆడాలని ఒత్తిడి చేయడం సరికాదు. గాయం ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ వంటి దేశాలను గ‌మ‌నించండి. అక్కడి అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఎప్పుడూ దేశీయ క్రికెట్ ఆడరు. ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలి'' అని అన్నారు. అలాగే, రాబోయే భార‌త సీజ‌న్ ను దృష్టిలో ఉంచుకుని వీరికి విశ్రాంతి ఇవ్వ‌డం స‌రైందేన‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. 

Rohit Sharma with Virat Kohli

అలాగే, "ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్ళు బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడటం మీరు చూస్తారు. అంటే మేము ఆటగాళ్లందరికీ ఒకే నిబంధనలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం. కానీ రోహిత్, విరాట్ విషయంలో అతని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో వారికి కొంత వెసులుబాటు ఇచ్చాము'' అని చెప్పారు. విశేషమేమిటంటే, దులీప్ ట్రోపీ టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా సహా భారత టెస్టు జట్టులోని పలువురు ఆటగాళ్లు పాల్గొనరు. మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యాడు. అతను ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. 

Latest Videos

click me!