Mitchell Starc: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్ట్, వన్డేలకు ప్రాధాన్యం ఇస్తూ తన కెరీర్‌ను మరింత కాలం కొనసాగిస్తానని తెలిపాడు. సూపర్ ఫామ్ లో వుండగా, ఇప్పుడే స్టార్క్ ఎందుకు రిటైర్ అయ్యారు?
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన అద్భుతమైన బౌలింగ్ తో అన్ని ఫార్మాట్లలో బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ మ్యాచ్ ను మలుపుతిప్పే సత్తా ఉన్న ప్లేయర్ అతను. స్టార్క్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 65 టీ20 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశారు.
35 ఏళ్ల స్టార్క్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ప్రధాన కారణం టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో తన కెరీర్‌ను కొనసాగించడమేనని తెలిపారు. మరీ ముఖ్యంగా రాబోయే సంవత్సరాల్లో టెస్ట్ సిరీస్‌లు, వన్డే ప్రపంచకప్ 2027 కోసం ఫిట్‌గా ఉండడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నాడు. అయితే, తాజాగా ఆయనకు ఆసీస్ జాతీయ టీ20 జట్టులో చోటుదక్కలేదు. ఇది కూడా ఒక కారణం అని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
DID YOU KNOW ?
ఐపీఎల్ లో మిచెల్ స్టార్క్
2024 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు మిచెల్ స్టార్క్‌ను ఏకంగా ₹24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అప్పటివరకు ఒక ఆటగాడికి లభించిన అత్యధిక ధర కావడం విశేషం.
25
రాబోయే సిరీస్ లు, ఐసీసీ ఈవెంట్లపై దృష్టి పెట్టిన మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా జట్టు ప్రకటించిన తాజా టీ20 సిరీస్‌లో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లకు చోటుదక్కలేదు. ఈ సిరీస్ న్యూజిలాండ్‌లో అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. మిచెల్ స్టార్క్ తన రిటైర్మెంట్ నిర్ణయంపై మాట్లాడుతూ.. "ప్రతి టీ20 మ్యాచ్ నాకు ప్రత్యేకం. ముఖ్యంగా 2021 వరల్డ్ కప్ విజయం మరచిపోలేనిది. కానీ రాబోయే రెండేళ్ల అంతర్జాతీయ షెడ్యూల్‌కి సిద్ధం కావాలంటే ఫిట్‌గా ఉండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పారు.
35
టెస్ట్, వన్డేల కోసమే రిటైర్మెంట్ అన్న మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్ తెలిపిన ప్రకారం.. రిటైర్మెంట్ వెనుక ప్రధాన కారణం టెస్ట్, వన్డే ఫార్మాట్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం. రాబోయే యాషెస్ సిరీస్, భారత్ పర్యటన, 2027 వన్డే వరల్డ్ కప్ లకు ఫుల్ ఫిట్‌నెస్‌లో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.
అలాగే, టీ20 ఫార్మాట్ నుండి తప్పుకోవడం వల్ల కొత్త బౌలర్లకు అవకాశం లభిస్తుందని కూడా స్టార్క్ అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్ ముందు జట్టులో కొత్త పేసర్లు స్థిరపడేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు.
మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్ పై జార్జ్ బెయిలీ ఏమన్నారంటే?
మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ స్పందించారు. "స్టార్క్ టీ20 కెరీర్‌పై గర్వపడాలి. ఆసీస్ కు అనేక అద్భుత విజయాలు అందించారు. ఆయన 2021 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన బౌలింగ్ శైలి ఆటను ఎప్పుడైనా మార్చగలిగేలా ఉంటుంది. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో ఎక్కువకాలం కొనసాగడం సంతోషించాల్సిన విషయం" అని అన్నారు.
55
స్టార్క్ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఇదేనా
స్టార్క్ రిటైర్మెంట్‌తో నాథన్ ఎలిస్, షాన్ అబ్బాట్, బెన్ డ్వార్షూయిస్, జావియర్ బార్ట్లెట్ వంటి కొత్త పేసర్లకు అవకాశాలు లభించనున్నాయి. స్టార్క్ లాంటి 145 కి.మీ వేగంతో స్వింగ్ చేసే బౌలర్‌ని భర్తీ చేయడం కష్టమే అయినా, ఆయన వెనక్కి తగ్గడం రాబోయే బౌలర్లకు అవకాశాలను అందిస్తుంది.
స్టార్క్ రిటైర్మెంట్ వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉంది. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని, ఎక్కువకాలం ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. టీ20 ఫార్మాట్ నుండి తప్పుకోవడం వెనుక ఆయనకు ఉన్న లక్ష్యం టెస్ట్, వన్డేల్లో తన కెరీర్‌ను కొనసాగించడం. అలాగే, కీలకమైన యాషెస్ సిరీస్, వన్డే ప్రపంచ కప్ లలో ఆడటం టార్గెట్ గా ఉంది. దీనిబట్టి చూస్తే ఇది తెలివైన నిర్ణయమని పలువురు క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.