Test cricket: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ !

Mahesh Rajamoni | Published : May 12, 2025 3:28 PM
Google News Follow Us

Virat Kohli Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, టెస్ట్ క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ పెట్టిన భావోద్వేగపూరిత పోస్ట్ తో రిటైర్మెంట్ విష‌యాన్ని వెల్ల‌డించాడు. అంతకుముందు రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో బీసీసీఐ చర్యలు చర్చనీయాంశంగా మారాయి.  

15
Test cricket: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ !

Virat Kohli Rohit Sharma: భారత క్రికెట్‌లో మరో యుగం ముగిసింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం బీసీసీఐ సమావేశంలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్ కావాలని ప్రకటించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. తాజాగా త‌న రిటైర్మెంట్ ను విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్ల‌డించాడు. 

25
Virat Kohli (File Photo)

7 మే 2025న ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో కోహ్లీ తన టెస్ట్ క్రికెట్‌కు రిటైర్ కావాలనే అభిప్రాయాన్ని బోర్డుకు తెలియజేశారు. బోర్డు ఈ నిర్ణయంపై పునరాలోచన చేయమని కోహ్లీని కోరింది. కానీ, కోహ్లీ తన నిర్ణయంలో మార్పు చేయ‌లేదు. 

కోహ్లీ తన కెరీర్‌లో 123 టెస్ట్ మ్యాచ్‌లలో 9230 పరుగులు సాధించారు. అతని అత్యధిక వ్యక్తిగ‌త‌ స్కోర్ 254 ప‌రుగులు. త‌న‌ టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 30 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి.

35

ఈ రిటైర్మెంట్‌తో, కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన 14 సంవత్సరాల ప్రయాణాన్ని ముగించారు. అతని ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు, కోహ్లీ తన కెరీర్‌లో కొత్త దశను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. భారత క్రికెట్‌లో కోహ్లీ చేసిన కృషి, విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

45

అయితే, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ షాకింగ్ రిటైర్మెంట్ వెనుక భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) చర్యలు కూడా ఉన్నాయని ప‌లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం గురించి బీసీసీఐ రోహిత్‌కు చాలా ముందుగానే తెలియజేసిందని ఒక మీడియా నివేదిక ఇప్పుడు పేర్కొంది. నివేదిక ప్రకారం, రోహిత్ ఇకపై జట్టు టెస్ట్ ప్రణాళికల్లో భాగం కాదని బోర్డు అతనికి స్పష్టం చేసింది. దీంతో రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. 

 

55

ఇదే స‌మ‌యంలో కోహ్లీ కూడా అదే ప‌రిస్థితిలోకి వ‌చ్చే ప‌రిస్థితుల నేప‌థ్యంలో కింగ్ కోహ్లీ కూడా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెబుతున్న‌ట్టు అదే రోజు బోర్డుకు తెలిపారు. అయితే ఇంగ్లాండ్ పర్యటన దృష్ట్యా దానిని పునఃపరిశీలించాలని బోర్డు కోహ్లీని కోరింది. కోహ్లీ నిర్ణయం మార్చుకోలేదు. ఇక కోహ్లీ నిర్ణయంలో బీసీసీఐ పెద్దగా జోక్యం చేసుకోలేదు. 

 

Read more Photos on
Recommended Photos