Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన టాప్-5 రికార్డులు

Published : May 12, 2025, 12:41 PM IST

Virat Kohli's rare top-5 records in Test cricket: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భార‌త జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించిన కోహ్లీ టెస్టులో తిరుగులేని రికార్డులు కూడా సాధించాడు. విరాట్ కోహ్లీ టాప్-5 అరుదైన టెస్ట్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన టాప్-5 రికార్డులు

Virat Kohli's rare top-5 records in Test cricket: రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌ నుంచి రిటైర్ అయిన వారం త‌ర్వాత టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా త‌న తన టెస్ట్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు ప‌లికాడు. సోమ‌వారం బీసీసీఐకి అధికారికంగా తెలిపాడు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వెంటనే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, 36 ఏళ్ల వయసులో ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

టెస్టు క్రికెట్ లో విరాట్ కోహ్లీ సాధించిన టాప్-5 అరుదైన రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

26

1. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచ‌రీలు

2014లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 115, రెండవ ఇన్నింగ్స్‌లో 141 పరుగులు సాధించాడు. భారత్ ఈ మ్యాచ్‌ను 48 పరుగుల తేడాతో కోల్పోయినా, కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించిన అరుదైన భారత ఆటగాడిగా నిలిచాడు.

36

2. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడు

2019లో పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లీ తన 7000వ టెస్ట్ పరుగును పూర్తి చేశాడు. కేవలం 138 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో అతడి అజేయ 254 పరుగుల ఇన్నింగ్స్‌తో  "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు గెలుచుకున్నాడు. 

46

3. భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు:

2014 నుండి 2022 వరకు టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ 68 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో 40 విజయాలు, 17 ఓటములు నమోదయ్యాయి. ఆయన విజయం శాతం 58.82గా ఉంది. మునుపటి కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ 60 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

56

4. ఎనిమిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (ఇండియా)

2016లో వాంఖడే వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ (235 ప‌రుగులు), జయంత్ యాదవ్ (104 ప‌రుగులు) కలిసి ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది భారత టెస్ట్ చరిత్రలో అత్యధిక ఎనిమిదో వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది.

66

5. ఓటమిలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత ఆటగాడు

అడిలైడ్ టెస్ట్ (2014) లో కోహ్లీ మొత్తం 256 పరుగులు (115 + 141) చేశాడు. కానీ భారత్ ఓడిపోయింది. వినూవ్ మాంకడ్ తర్వాత ఓటమిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories