Top 5 unbreakable Test records of Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అనేక రికార్డులు సాధించాడు. కింగ్ కోహ్లీ సాధించిన టాప్-5 అన్‌బ్రేకబుల్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
16
Virat Kohli (File Photo)
Top 5 unbreakable Test records of Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించారు. కోహ్లీ తన కెరీర్ లో అనేక రికార్డులు సాధించారు. అలాంటి వాటిలో టాప్-5 అన్‌బ్రేకబుల్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
26
Virat Kohli (File Photo)
1. టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీ
విరాట్ కోహ్లీ, భారత్ తరఫున టెస్ట్ కెప్టెన్‌గా 7 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. 2016 నుంచి ఈ ఘనత సాధించిన కోహ్లీ, 123 టెస్ట్ మ్యాచ్‌లలో 9230 పరుగులు చేశారు. మొదటి ఐదేళ్లలో ఒక్క డబుల్ సెంచరీ చేయని కోహ్లీ, ఆ తరువాత తన ఆటలో గణనీయమైన మార్పు తెచ్చాడు. పరుగుల వర్షం తీసుకువచ్చాడు. సెంచరీల మోత మోగించాడు.
36
2. టెస్ట్ కెప్టెన్‌గా భారత్ తరఫున అత్యధిక విజయాలు అందించిన కోహ్లీ
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్‌గా 68 మ్యాచ్‌లకు భారత్ కు నాయకత్వం వహించాడు. ఇందులో 40 విజయాలు అందించాడు. మిగిలిన మ్యాచ్ లలో 17 ఓటములు, 11 డ్రాలు ఉన్నాయి. కెప్టెన్ గా కింగ్ కోహ్లీ విన్నింగ్ శాతం 58.82% గా ఉంది.
3. టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ
ఇంతవరకు భారత ప్లేయర్లు ఎవరూ దాటలేని మైలురాయిగా కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కోహ్లీ తర్వాత ధోని 60 మ్యాచ్‌లు ఆడాడు.
56
4. విదేశాల్లో అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు కలిగిన కోహ్లీ
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో టెస్ట్ సిరీస్‌లు గెలిపించిన ఏకైక భారత కెప్టెన్ కోహ్లీ. విదేశాల్లో 36 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 16 విజయాలు అందించాడు. సొంతగడ్డపై 31 టెస్ట్‌లు ఆడి 24 గెలిపించాడు. ఇది ఇతర భారత కెప్టెన్లతో పోలిస్తే అత్యుత్తమ ప్రదర్శన.
66
5. భారత టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ
విరాట్ కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్‌గా 5864 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. భారత కెప్టెన్సీపై ఉన్న ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇంత పెద్ద స్కోరు చేయడం కోహ్లీకే సాధ్యమైంది.
మొత్తంగా కోహ్లీ తన టెస్టు కెరీర్ లో 123 మ్యాచ్ లలో 210 ఇన్నింగ్స్‌లు ఆడి 9230 పరుగులు కొట్టాడు. అత్యధిక స్కోరు 254 పరుగులు. 55.57 సగటుతో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు బాదాడు.