Mustafizur Rahman: 4 ఓవర్లలో 6 పరుగులే.. బుమ్రా రికార్డును బద్దలుకొట్టిన ముస్తాఫిజుర్ రెహమాన్

Published : Jul 20, 2025, 10:22 PM IST

Mustafizur Rahman: పాకిస్తాన్‌పై తొలి టీ20లో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి చరిత్ర సృష్టించాడు. ఇది బంగ్లాదేశ్ టీ20 చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ స్పెల్ గా నిలిచింది.

PREV
15
ముస్తాఫిజుర్ రెహమాన్ చరిత్ర సృష్టించాడు

బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఆదివారం (జూలై 20) ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్‌పై జరిగిన తొలి టీ20లో అద్భుత బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ముస్తాఫిజుర్ 4 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ అద్భుత స్పెల్ తో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.

25
బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన ముస్తాఫిజుర్ రెహమాన్

టీ20 వరల్డ్ కప్ 2024లో అఫ్గానిస్తాన్‌పై భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. కానీ ముస్తాఫిజుర్ ఇప్పుడు దాన్ని అధిగమించాడు. బంగ్లాదేశ్ టీ20 చరిత్రలోనే అత్యల్పంగా పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చాడు.

35
పాకిస్తాన్‌ను తొలిసారి ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో పాకిస్తాన్‌ను కేవలం 110 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇది టీ20లో బంగ్లాదేశ్ తొలిసారి పాకిస్తాన్‌ను ఆలౌట్ చేసిన సందర్భం. ముస్తాఫిజుర్‌ రెహమాన్ కు తోడుగా టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు (3.3 ఓవర్లలో 22 పరుగులు) తీసి బంగ్లాదేశ్ విజయానికి బేస్ వేసాడు. మహేది హసన్, తంజిమ్ హసన్ తలా ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.

45
మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ రెహమాన్ స్పెషల్ స్పెల్

ఐదో ఓవర్లో హసన్ నవాజ్‌ను పెవిలియన్‌కు పంపిన ముస్తాఫిజుర్ రెహమాన్, పదకొండో ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్లో ఫఖర్ జమాన్ రనౌట్ అయ్యాడు. ఆపై 13వ ఓవర్లో ఖుష్దిల్ షాను ఔట్ చేసి తన స్పెల్‌ను ముగించాడు. మొత్తం 4-0-6-2 ఫిగర్స్‌తో టీ20 చరిత్రలో కొత్త రికార్డు ను నమోదుచేశారు.

55
బ్యాటింగ్‌లో పర్వేజ్, హ్రిదోయ్ దూకుడు

110 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 27 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. పర్వేజ్ హొసేన్ ఎమోన్ 39 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. హ్రిదోయ్ 36 పరుగులు చేశాడు. జకీర్ అలీ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ముస్తాఫిజుర్ రెహమాన్ అద్భుత ప్రదర్శనతో రికార్డుల మోత మోగించడం.. పాక్ పై బంగ్లాదేశ్ గెలుపు చరిత్రాత్మకంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories