Kane Williamson: విరాట్ కోహ్లి సెంచ‌రీల రికార్డును స‌మం చేసిన కేన్ విలియమ్సన్..

First Published | Nov 29, 2023, 5:27 PM IST

Kane Williamson: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎనిమిది నెలల తర్వాత తొలిసారి ఈ ఫార్మాట్ ఆడినప్పటికీ టెస్టు క్రికెట్లో తన జోరును కొనసాగించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ తో అద్భుత బ్యాటింగ్ తో సంచ‌రీ చేసి, విరాట్ కోహ్లీ రికార్డును స‌మం చేశాడు. 
 

Kane Williamson: సిల్హెట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ త‌న బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. తన కెరీర్ లో 29వ సెంచరీ సాధించాడు. దీంతో టెస్టు క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, డాన్ బ్రాడ్‌మ‌న్ ల‌ను స‌మం చేశాడు. 
 

న్యూజిలాండ్ తరుపున టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన చివరి రెండు ఇన్నింగ్స్ ల్లో మూడంకెల మార్కును చేరుకున్న విలియమ్సన్ కు రెడ్ బాల్ క్రికెట్ లో ఇది వరుసగా మూడో సెంచరీ.


ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 29 సెంచరీలు పూర్తి చేయడానికి కోహ్లీ కంటే 22 ఇన్నింగ్స్ లు, 16 టెస్టులు తక్కువ తీసుకున్నాడు. అలాగే, 55 కంటే ఎక్కువ సగటును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 111 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడిన విరాట్ కోహ్లీ 165 ఇన్నింగ్స్ ల్లో 29 సెంచరీలు సాధించాడు. చివ‌ర‌గా 2023లో  జూలైలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు.

విలియమ్సన్ ప్ర‌స్తుత ఇన్నింగ్స్ విషయానికి వస్తే 205 బంతుల్లో 11 ఫోర్లతో 104 పరుగులు చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మెరుగైన స్థితిలోకి తీసుకువ‌చ్చాడు. డారిల్ మిచెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (42) మాత్రమే ఔటయ్యే ముందు అతనితో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు, కానీ విలియమ్సన్ తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో సెంచ‌రీ బాదాడు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే టెస్టు మ్యాచ్ తొలి రోజు బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 310 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ మాజీ టెస్టు కెప్టెన్ విలియ‌మ్స‌న్ అద్భుత సెంచరీతో రెండో రోజు ఆటను 266/8 వద్ద ముగించింది. న్యూజిలాండ్ 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో విలియమ్సన్ నిల‌దొక్కుకుని జ‌ట్టుకు మంచి స్కోర్ ను అందించాడు.
 

Latest Videos

click me!