Virat Kohli: దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి ఔట్.. వన్డే-టీ20ల నుంచి విరాట్ కోహ్లీ రిటైర్ కాబోతున్నాడా?

First Published | Nov 29, 2023, 4:00 PM IST

Virat Kohli: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ వ‌న్డే, 20 సిరీస్ ల‌ను ఆడ‌నుంది. అయితే, రానున్న‌ వన్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉండాలని భార‌త‌ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నట్లు ప‌లు రిపోర్టులు పేర్కొనడం సంచ‌ల‌నంగా మారింది.
 

Star Indian batter Virat Kohli: ఐసీసీ క్రికెట్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో మెరుపులు మెరిపించిన టీమిండియా స్టార్ బ్యాట‌ర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20, వన్డే సిరీస్ ల‌కు దూరం కానున్నాడని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 

భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి బిగ్ న్యూస్ వ‌చ్చింది. వన్డేలు, టీ20 సిరీస్‌లకు అతను దూరమయ్యాడనీ, అయితే టెస్టులు ఆడనున్నాడని వార్తలు వస్తున్నాయి. విరాట్ ఈ విరామంపై  అనేక ఊహాగ‌నాలు వినిపిస్తున్నాయి.
 


ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో మెరుపులు మెరిపించిన విరాట్ కోహ్లీ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కు దూరం కానున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో 11 మ్యాచ్ ల‌లో మొత్తం 765 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోబోతున్నార‌ని వ‌స్తోంది. అయితే, డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ లో టెస్టు సిరీస్ లో ఆడనున్నాడు.
 

Virat Kohli Bowling

వైట్ బాల్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని కోహ్లీ బీసీసీఐకి తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక క‌థ‌నం పేర్కొంది. అందులో వైట్ బాల్ క్రికెట్ నుంచి తనకు విరామం అవసరమని బీసీసీఐ, సెలెక్టర్లకు కోహ్లీ తెలిపిన‌ట్టు పేర్కొంది. 
 

టెస్ట్ క్రికెట్ కు ఆడ‌తాన‌నీ, దక్షిణాఫ్రికాలో జరిగే రెండు టెస్టులకు ఎంపికయ్యేందుకు అందుబాటులో ఉంటాన‌ని బీసీసీఐకి చెప్పిన‌ట్టు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఈ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. టీ20, వన్డేలకు దూరంతో.. సోష‌ల్ మీడియా వేదిక‌గా విరాట్ కోహ్లీ అభిమానులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. 
 

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిన తర్వాత కోహ్లీ ప్రస్తుతం లండన్ లో హాలిడేలో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లండన్ లో ఉన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ 2023 లో ఫైనల్లో ఓడిపోవడానికి ముందు భారతదేశానికి వరుసగా 10 విజయాలను అందించిన రోహిత్ కూడా రాబోయే సిరీస్ ల‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.
 

ఒకవేళ దక్షిణాఫ్రికాతో జ‌రిగే టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ తప్పుకుంటే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించే లిస్టులో ముందుంటాడు. కోహ్లీ తన బాధ్యతల నుంచి వైదొలగడం, రోహిత్ గాయపడటంతో 2022 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా రాహుల్ భారత కెప్టెన్ గా వ్యవహరించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం భారత కెప్టెన్ పదవికి జస్ప్రీత్ బుమ్రాను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవ‌కాశ‌ముంది. 
 

మూడు టీ20ల సిరీస్ తో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ డిసెంబర్ 10న డర్బన్ లో జ‌ర‌గ‌నుంది. టీ20 సిరీస్ ముగిసిన త‌ర్వాత మూడు వ‌న్డేలు డిసెంబర్ 17, 19, 21 తేదీలలో వ‌రుస‌గా జోహన్నెస్‌బర్గ్, గెబెర్హా, పార్ల్‌లలో జరగ‌నున్నాయి.
 

Latest Videos

click me!