Ashish Nehra: బీసీసీఐ పిలిచి మ‌రీ భారత జ‌ట్టు కోచ్ ప‌ద‌వి ఇస్తామంటే వ‌ద్ద‌న్నాడు.. ఇదెక్క‌డి స్ట్రాట‌జీ బ్రో !

First Published | Nov 29, 2023, 4:54 PM IST

Ashish Nehra: ఐపీఎల్‌లో ఆశిష్ నెహ్రా తొలి సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టి, తర్వాతి సీజన్‌లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. ఈ గొప్పతనాన్ని చూసిన బీసీసీఐ.. భారత టీ20 జట్టుకు కోచ్‌గా ఉండాల్సిందిగా నెహ్రాను ఆహ్వానించింది.
 

BCCI: భార‌త జ‌ట్టుకు కోచ్ గా ప‌నిచేయ‌మంటే ఎమ‌రైనా మ‌రోమాట చెప్ప‌కుండా ఒకే చెప్పేస్తారు. అంత ప్ర‌ధాన్య‌త క‌లిగింది మ‌రి. అయితే, భార‌త మాజీ క్రికెట్ ఒక‌రు మాత్రం పిలిచి మ‌రీ కోచ్ ప‌ద‌వి తీసుకోమ్మంటే సూటిగా వ‌ద్ద‌ని చెప్పేశాడు. ఎవ‌ర‌నుకుంటున్నారా? అత‌నే భారత క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ ఆశిష్ నెహ్రా. 

టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా భారత టీ20 జట్టు ప్రధాన కోచ్ పదవి ఆఫర్ ను తిరస్కరించాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కోచ్ గా స‌త్తాచాటిన నెహ్రాను వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ క‌ప్ కు ముందు భార‌త టీ20 జట్టుకు కోచ్ గా నియమించాలని బీసీసీఐ భావించింది.
 


ఐపీఎల్ తొలి సీజన్ లోనే ఆశిష్ నెహ్రా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ ద‌క్కించుకుంది. ఈ త‌ర్వాతి సీజ‌న్ లో ఫైన‌ల్ కు దూసుకెళ్లింది. ఇది గమనించిన బీసీసీఐ నెహ్రాను భారత టీ20 జట్టుకు కోచ్ గా ఆహ్వానించింది.
 

అయితే, ఆశిష్ నేహ్రా తాను ప్రధాన కోచ్ గా ఉండబోనని స్పష్టం చేయడంతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ను వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వరకు పొడిగించాలని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది.
 

కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ద్రవిడ్ కొనసాగింపున‌కు అనుకూలంగా ఉన్నాడు. ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత కోచ్ గా కొనసాగడంపై ద్రవిడ్ తన వైఖరిని స్పష్టం చేయలేదు. రాహుల్ ద్రావిడ్ కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ద్రావిడ్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వ‌చ్చాయి. 
 

Ashish Nehra

అయితే, తాజాగా ద్రావిడ్ హెడ్ కోచ్ గా కొనసాగింపును బీసీసీఐ నిర్ధారించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రాకే పదవీకాలం కూడా పొడిగింపు లభిస్తుంది.
 

ప్రపంచకప్ తర్వాత కోచ్ గా ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియ‌డంతో ఐపీఎల్ జట్లు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ద్రావిడ్ ను కోచ్ లేదా మెంటార్ గా నియమించాలని సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాగే, ద్రవిడ్ స్థానంలో జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు నెహ్రాకు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Latest Videos

click me!