IND vs AUS : వన్డే క్రికెట్‌లో కొత్త రికార్డు సృష్టించిన వైజాగ్ మ్యాచ్

Published : Oct 12, 2025, 11:57 PM ISTUpdated : Oct 13, 2025, 12:03 AM IST

India vs Australia: మహిళా ప్రపంచ కప్ 2025లో విశాఖలో మరోసారి భారత్ కు షాక్ తగిలింది. టీమిండియా ఉంచిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మహిళా జట్టు అందుకుని కొత్త రికార్డు సాధించింది.

PREV
15
వైజాగ్ లో భారత్ కు షాక్.. ఆస్ట్రేలియా ఘన విజయం

విశాఖపట్నంలో జరిగిన మహిళా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన బౌలింగ్ లో ప్రభావం చూపించలేకపోయింది. ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ 142 పరుగుల సెంచరీ నాక్ ఈ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫిబీ లిచ్‌ఫీల్డ్ (40), ఎల్లీస్ పెర్రీ 47* పరుగులు, ఆష్లీ గార్డనర్ 45 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడటంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్ పై విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు వన్డే క్రికెట్‌లో అత్యధిక రన్స్ టార్గెట్ ను అందుకున్న టీమ్ గా రికార్డును సృష్టించింది.

25
మహిళా వన్డే క్రికెట్‌లో అత్యధిక రన్స్ ఛేజ్ రికార్డు

1. 331 - ఆస్ట్రేలియా vs భారత్, విశాఖ, 2025

2. 302 - శ్రీలంక vs సౌతాఫ్రికా, పోట్చెఫ్‌స్ట్రూమ్, 2024

3. 289 - ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, నార్త్ సిడ్నీ, 2012

4. 283 - ఆస్ట్రేలియా vs భారత్, వాంఖడే, 2023

5. 282 - ఆస్ట్రేలియా vs భారత్, న్యూ చండీగడ్, 2025

35
స్మృతి మంధనా, ప్రతికా రావల్ హాఫ్ సెంచరీ నాక్ లు

భారత్ మొదట బ్యాటింగ్ చేసి 330 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, స్మృతి మంధనా 80 పరుగులు, ప్రతికా రవల్ 75 పరుగులు ఇన్నింగ్స్ లతో భారత్ కు మంచి శుభారంభం అందించారు. ఈ జోడీ 155 పరుగుల భాగస్వామ్యం అందించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఎవరూ కూడా పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. లోయర్ ఆర్డర్ వికెట్లు వరుసగా పడ్డాయి. దీంతో భారత్ ఓవర్లు పూర్తి కాకముందే ఆలౌట్ అయింది.

45
తిరిగి పుంజుకున్న ఆస్ట్రేలియా బౌలింగ్

మ్యాచ్ ఆరంభంలో ఆస్ట్రేలియా బౌలింగ్ ను భారత ఓపెనర్లు దంచికొట్టారు. ఫోర్లు, సిక్సర్లతో కంగారెత్తించారు. కానీ, ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత ఆసీస్ బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. అనాబెల్ సదర్లాండ్ 5 వికెట్లు తీశారు. చివరి 7 వికెట్లను భారత్ వరుస ఓవర్లలో కోల్పోయింది. సోఫీ మోలినూ 10 ఓవర్లలో 3 వికెట్లు తీశారు. మొత్తంగా చివరి ఓవర్లలో అస్ట్రేలియా బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు.

55
ఉత్కంఠగా సాగిన మ్యాచ్

టార్గెట్ ను అందుకునే క్రమంలో హీలీ-లిచ్‌ఫీల్డ్ జంట 10 ఓవర్లలో 82 పరుగులతో కంగారు టీమ్ కు శుభారంభం అందించారు. లిచ్‌ఫీల్డ్ 40 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. అలిస్సా హీలీ తన జోరును కొనసాగించారు. ఎల్లీస్ పెర్రీ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 142 పరుగుల సెంచరీ నాక్ తో విజయాన్ని అందించారు.

భారత జట్టులో మంధాన, ప్రతికా జంట మంచి ప్రారంభం అందించినా, మిడిల్, లోయర్ ఆర్డర్ ప్లేయర్ల ఆసీస్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు. వచ్చినవారు వచ్చినట్టుగా క్రీజును వీడారు.

Read more Photos on
click me!

Recommended Stories