ఆసియా కప్ 2025 కు రంగం సిద్ధం.. మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు ఇవి

Published : Sep 08, 2025, 10:44 PM IST

Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఏఈలో జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. రెండు గ్రూపులుగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది.

PREV
16
ఆసియా కప్ 2025: మరో క్రికెట్ పండగ

17వ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 ఘనంగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో ఆసియా కప్ 2025 జరగనుంది. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. ఇది రాబోయే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ముందు సన్నాహక టోర్నమెంట్‌గా భావిస్తున్నారు. మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం వేదికలపై జరుగుతాయి.

DID YOU KNOW ?
ఆసియా కప్ ఫార్మాట్
ఆసియా కప్ 2025 ఎడిషన్ టీ20 ఫార్మాట్ లో జరుగుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీ వన్డే, టీ20 ఫార్మాట్ లో జరిగింది.
26
ఆసియా కప్ 2025 లో పాల్గొనే జట్లు ఇవే

ఈ ఏడాది ఆసియా కప్‌లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

• గ్రూప్ A: ఇండియా, పాకిస్థాన్, యుఏఈ, ఒమన్

• గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్

ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి.

36
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫార్మాట్ ఏంటి?

ఆసియా కప్ 2025 మల్టీ-స్టేజ్ ఫార్మాట్లో జరుగుతుంది. టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

1. గ్రూప్ దశ: జట్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో పోటీపడతాయి.

2. సూపర్ ఫోర్: ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు జట్లు సూపర్ ఫోర్‌కి వెళ్తాయి.

3. ఫైనల్: సూపర్ ఫోర్‌లో టాప్ నిలిచిన రెండు జట్లు సెప్టెంబర్ 28న ఫైనల్లో తలపడతాయి.

46
ఆసియా కప్ 2025 షెడ్యూల్, టైమింగ్స్

• టోర్నమెంట్ సెప్టెంబర్ 9న అబుదాబిలో అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.

• క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగుతుంది.

• ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది.

• తొలి మ్యాచ్ GMT ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 8:00 గంటలకు ప్రారంభమవుతుంది.

56
ఆసియా కప్ 2025 లైవ్, స్ట్రీమింగ్ వివరాలు

ఆసియా కప్ 2025 ప్రపంచవ్యాప్తంగా అనేక ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

• భారత్: Sony Sports Network టీవీ ప్రత్యక్ష ప్రసారం, SonyLIV యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్.

• పాకిస్థాన్: PTV Sports HD టీవీ ప్రసారం, Tapmad, Mycoలో లైవ్ స్ట్రీమింగ్.

• బంగ్లాదేశ్: Gazi TV టీవీలో ప్రసారం, Toffee, Tapmad లో లైవ్ స్ట్రీమింగ్.

• శ్రీలంక: Sirasa TV, TV-1 లో లైవ్, Dialog ViU యాప్‌లో స్ట్రీమింగ్.

• అమెరికా: Willow TV ప్రసారం అవుతుంది.

• ఆస్ట్రేలియా: Kayo Sportsలో లైవ్

• యుఏఈ, MENA ప్రాంతం: CricLife టీవీలో లైవ్ ప్రసారం, StarzPlay లైవ్ స్ట్రీమింగ్.

66
ఆసియా కప్ లో అత్యంత విజయవంతమైన జట్టు భారత్

ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు టీమిండియా. భారత్ 8 సార్లు టైటిల్ గెలిచింది. శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు విజేతలుగా నిలిచాయి. 1984లో యూఏఈలో, 1988లో బంగ్లాదేశ్‌లో, 1990-91లో భారత్‌లో, 1995లో యూఏఈలో, 2010లో శ్రీలంకలో, 2016లో బంగ్లాదేశ్‌లో, 2018లో యూఏఈలో, 2023లో పాకిస్థాన్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరిగిన టోర్నమెంట్‌లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది.

శ్రీలంక 6 సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ ను గెలిచింది. 1986లో పాకిస్థాన్‌పై, 1997లో భారత్‌పై, 2004లో భారత్‌పై, 2008లో భారత్‌పై, 2014లో పాకిస్థాన్‌పై, 2022లో పాకిస్థాన్‌పై విజయాలు సాధించింది.

పాకిస్థాన్ ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే ఆసియా కప్ గెలిచింది. 2000లో శ్రీలంకపై, 2012లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

Read more Photos on
click me!

Recommended Stories