Pakistan vs Sri Lanka : ఆసియా కప్ టోర్నీ సూపర్-4 లో కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డైగా మారింది. గెలిచిన జట్టుకు ఫైనల్ అవకాశాలు మిగిలి ఉంటాయి. గెలిచేది ఎవరు?
ఆసియా కప్ 2025 సూపర్-4 లో పాకిస్తాన్, శ్రీలంకా జట్లు మంగళవారం పోటీ పడుతున్నాయి. యూఏఈలోని అబుదాబి షేక్ జాయెద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ను ఇరు జట్లకు మస్ట్ విన్ అని చెప్పొచ్చు. ఓడిన జట్టుకు ఫైనల్‌లో చేరే అవకాశాలు దాదాపు పూర్తిగా ముగిసిపోతాయి. సూపర్ 4 లో రెండు జట్లు కూడా తమ మొదటి మ్యాచ్‌లను గెలుచుకోలేదు. పాకిస్తాన్ భారత్ చేతిలో, శ్రీలంక బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. అందుకే ఈ పోరు పాక్, శ్రీలంకలకు డూ ఆర్ డై గా మారింది.
26
పాకిస్తాన్ జట్టు ముందున్న సవాళ్లు ఏంటి?
పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఎందుకంటే వారి బ్యాటింగ్ విభాగంలో స్థిరత్వం లేదు. ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్నారు. పెద్ద ఇన్నింగ్స్ లను ఆడటం లేదు. అలాగే, మిడిలార్డర్ నుంచి కూడా రన్స్ రావడం లేదు.
బౌలింగ్‌లో శాహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్‌లు గొప్ప ఫామ్‌లో లేరు. భారత్ మ్యాచ్‌లో చివరి ఓవర్లలో బౌలర్ల నియంత్రణ కోల్పోవడం వారిని దెబ్బకొట్టింది. ఈ అంశాలన్నీ కలిపి పాక్ కు గట్టి సవాళ్లుగా ఉన్నాయి.
36
శ్రీలంకా పాక్ ముందు నిలిచేనా?
శ్రీలంక కూడా ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ తో ఇబ్బంది పడుతోంది. వారి బ్యాటింగ్ లైనప్‌లో సమన్వయం లేకపోవడం జట్టుకు నష్టం కలిగిస్తోంది. యువ ఆటగాళ్లు ఒత్తిడి సమయంలో తడబడుతున్నారు. బౌలింగ్‌లో హసరంగ, దసున్ శానక ఫామ్‌లోకి రావాలి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో రాణించడంలో విఫలమయ్యారు. ఈ లోపాలను అధిగమించకపోతే లంక జట్టుకు ఫైనల్ రేసు కష్టమవుతుంది.
పాకిస్తాన్ vs శ్రీలంక: పిచ్, టాస్, డ్యూ ప్రభావం ఎలా ఉంటుంది?
షేక్ జాయెద్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం మ్యాచ్‌లలో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 165 నుంచి 175 మధ్య స్కోరు చేస్తే మ్యాచ్ ను తమవైపు నిలుపుకోవచ్చు. డ్యూ కారణంగా చాలా జట్లు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ కూడా ప్రభావం చూపనుంది.
56
పాకిస్తాన్ vs శ్రీలంక: లైవ్ ఎక్కడ చూడొచ్చు?
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. Sony Sports, Sony Liv, FanCode, YuppTV ప్లాట్‌ఫామ్ లలో లైవ్ అందుబాటులో ఉంటుంది.
66
పాకిస్తాన్ vs శ్రీలంక: ఎవరు గెలుస్తారు?
పాకిస్తాన్ vs శ్రీలంక హెడ్ టు హెడ్ రికార్డులో పాకిస్తాన్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. కానీ గత కొన్ని సిరీస్‌లలో శ్రీలంక పాక్‌పై మంచి ప్రదర్శన చేసింది. పాక్ బలమైన ఫాస్ట్ బౌలింగ్‌తో వస్తోంది. లంకా స్పిన్ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గత రికార్డులు, తాజా ఫామ్ గమనిస్తే ఇరు జట్ల మధ్య మంచి పోటీ ఉంటుంది.