భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్‌కు మంగళవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ డూ ఆర్ డై పోరాటం కానుంది. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అనూహ్యంగా ఓడిపోయిన శ్రీలంకకు కూడా పాకిస్తాన్‌ను ఓడిస్తేనే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగడం పక్కాగా అనిపిస్తోంది.
బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడే భారత్, ఆ మ్యాచ్‌లో గెలిస్తే శ్రీలంకతో జరిగే చివరి మ్యాచ్ కంటే ముందే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోవచ్చు.
బంగ్లాదేశ్‌కు కూడా ఛాన్స్ ఉంది
ఒకవేళ బంగ్లాదేశ్, భారత్‌ను ఓడిస్తే, ఆ జట్టు కూడా ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్, శ్రీలంక జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించే పరిస్థితి రావచ్చు. అయితే, మూడు జట్లు తలా రెండు విజయాలు సాధించే అవకాశం ఉన్నందున, ఫైనల్‌కు ఎవరు చేరుకుంటారో నిర్ణయించడంలో నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు ఫైనల్‌లో తలపడలేదు.