Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్ తో ఆడుతున్న టీమిండియా.. రోహిత్ శర్మ వికెట్ ను త్వరగానే కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి..
టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆటతీరు మారడం లేదు. పవర్ ప్లే లో ధాటిగా ఆడాలనే ఆతృతతో వికెట్ ను సమర్పించుకుంటున్న అతడు.. తాజాగా హాంకాంగ్ తో మ్యాచ్ లో కూడా అదే రీతిలో ఔటయ్యాడు. గత కొంతకాలంగా ఈ దూకుడు మంత్రంతోనే హిట్ మ్యాన్ మంచి ప్రారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు.
25
Image credit: Getty
తాజాగా హాంకాంగ్ తో మ్యాచ్ లో కూడా రోహిత్.. 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 1 సిక్సర్ కూడా ఉంది. అయితే అతడు ఆ దూకుడును కొనసాగించలేకపోయాడు.
35
అయుశ్ శుక్లా వేసిన టీమిండియా ఇన్నింగ్స్ 5వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్ కొట్టిన హిట్ మ్యాన్.. ఐదో బంతికి మిడ్ ఆన్ లో ఐజజ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
45
Image credit: PTI
రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. మరో ఎండ్ లో రాహుల్ కూడా నెమ్మదిగానే ఆడుతున్నాడు. ఈ ఇద్దరూ కలిసి క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.
55
12 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు.. ఒక వికెట్ నష్టానికి 85 పరుగులు చేయగలిగింది. కెఎల్ రాహుల్ (35), విరాట్ కోహ్లీ (25) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ గేర్ మార్చకపోతే భారత జట్టు భారీ స్కోరు చేయడం కష్టమే..