అతను ధోనీలా మారాడు, టీమిండియా కెప్టెన్సీ ఇవ్వడమే తరువాయి... హార్ధిక్ పాండ్యాపై హర్భజన్ సింగ్...

Published : Aug 31, 2022, 06:33 PM IST

2022 ఏడాది హర్ధిక్ పాండ్యాకి బాగా కలిసి వచ్చింది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 వరకూ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపైనే ఫోకస్ పెట్టిన హార్ధిక్ పాండ్యా... రీఎంట్రీ తర్వాత సక్సెస్‌ల మీద సక్సెస్‌లు చూస్తున్నాడు...

PREV
17
అతను ధోనీలా మారాడు, టీమిండియా కెప్టెన్సీ ఇవ్వడమే తరువాయి... హార్ధిక్ పాండ్యాపై హర్భజన్ సింగ్...
Image credit: Getty

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా టైటిల్ గెలిచిన హార్ధిక్... అటు బ్యాటు, ఇటు బాల్‌, మరో పక్క ఫీల్డింగ్‌తో పూర్తి ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించాడు...

27
Hardik Pandya

కెప్టెన్‌గా ఐర్లాండ్‌పై టీ20 సిరీస్ నెగ్గిన హార్ధిక్ పాండ్యా, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ల రేసులోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌ కంటే హార్ధిక్ పాండ్యాకి భారత జట్టు సారథ్య బాధ్యతలు ఇస్తే బాగుంటుందంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది...

37
Hardik Pandya

పాకిస్తాన్‌పై ఆల్‌రౌండ్ షోతో మెరుపులు మెరిపించి, సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించిన హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. 

47
hardik

‘హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలి. నాకు తెలిసి అతనే కెప్టెన్ అవుతాడు. కెప్టెన్‌గా మారిన తర్వాత అతనిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు పాండ్యాని చూస్తుంటే నాకు మాహీ కనిపిస్తున్నాడు...

57
Image credit: PTI

చాలా కూల్‌గా కామ్‌గా ఎక్కువగా భావోద్వేగాలకు లోను కాకుండా మ్యాచ్‌ని ఫినిష్ చేస్తున్నాడు హార్ధిక్ పాండ్యా. అతని బ్యాటింగ్, బౌలింగ్‌పై తనకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. తానేం చేయగలడో అందరికంటే బాగా అతనికే తెలుసు...

67
Image credit: PTI

హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని యాటిట్యూడ్ మరో లెవెల్‌లో ఉంటుంది. అతను గాయం నుంచి కోలుకోవడానికి చాలా కఠినంగా శ్రమించాడు. గంటలగంటలు ప్రాక్టీస్ చేశాడు. జిమ్‌లో వర్కవుట్లు చేశాడు... జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అంతే కష్టపడుతున్నాడు...

77
Image credit: PTI

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా చూపించిన టెంపర్‌మెంట్ చూసిన తర్వాత అతను కచ్ఛితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడని అనిపిస్తోంది. ఐపీఎల్‌లో పాండ్యా కెప్టెన్సీ అద్భుతంగా చేశాడు. భారత జట్టును నడిపించడానికి కావాల్సిన అన్ని అర్హతలు అతని దగ్గర ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...
 

Read more Photos on
click me!

Recommended Stories