హార్ధిక్ పాండ్యాకి రెస్ట్ ఇస్తే అతనికి అవకాశం ఇవ్వాలి! రిషబ్ పంత్‌ని ఎలా ఆడిస్తారు... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published | Aug 31, 2022, 7:39 PM IST

రోహిత్ శర్మ కెప్టెన్‌గా, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా ఓ ప్రయోగ శాలగా మారింది. ఏడు నెలల్లో 8 మంది కెప్టెన్లను మార్చిన భారత జట్టు, సిరీస్‌కో ఓపెనింగ్ జోడీని కూడా ప్రయోగించింది. ఐర్లాండ్ టూర్‌లో దీపక్ హుడా, ఇంగ్లాండ్ టూర్‌లో రిషబ్ పంత్, విండీస్ టూర్‌లో సూర్యకుమార్ యాదవ్‌లను ఓపెనర్లుగా పంపింది భారత జట్టు...

Deepak Hooda should get chance if Hardik Pandya rested, not Rishabh Pant, Says Gautam Gambhir

ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌తో బరిలో దిగింది... హంగ్ కాంగ్‌తో పాటు రిషబ్ పంత్‌కి తిరిగి జట్టులో అవకాశం కల్పించింది టీమిండియా...

Deepak Hooda should get chance if Hardik Pandya rested, not Rishabh Pant, Says Gautam Gambhir
Rishabh Pant

మొదటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది టీమిండియా. పాండ్యా ప్లేస్‌లో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చాడు...


ఈ రిప్లేస్‌మెంట్ ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ‘రిషబ్ పంత్‌కి అవకాశం ఇస్తే, దినేశ్ కార్తీక్‌ని బెంచ్‌లో కూర్చోబెట్టాలి. ఒకవేళ హార్ధిక్ పాండ్యాకి విశ్రాంతి ఇస్తే, అతని ప్లేస్‌లో దీపక్ హుడాని ఆడించాలి. అదే కదా సరైన రిప్లేస్‌మెంట్ అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

హార్ధిక్ పాండ్యాకి విశ్రాంతినిచ్చి రిషబ్ పంత్‌కి తుది జట్టులో అవకాశం ఇవ్వడంతో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతోంది టీమిండియా. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు జూనియర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు...

రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకు తుదిజట్టులో అవకాశం దక్కడంతో ఐదుగురు బౌలర్లతో బరిలో దిగింది భారత జట్టు. రిషబ్ పంత్ రూపంలో హార్ధిక్ పాండ్యా ప్లేస్‌లో ఓ బ్యాటర్ అందుబాటులోకి వచ్చినా, బౌలర్‌గా ఓ ప్లేయర్‌ని కోల్పోయినట్టైంది.. 

Dinesh Karthik

2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఏకైక నలుగురు వికెట్ కీపర్లతో బరిలో దిగింది భారత జట్టు. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కెఎల్ రాహుల్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడం తీవ్ర వివాదాస్పదమైంది.. 

Latest Videos

click me!