షమీ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?

Published : Sep 03, 2025, 06:29 PM IST

Mohammed Shami Net Worth: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన అద్భుతమైన బౌలింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. బీసీసీఐ సాలరీ, ఐపీఎల్ డీల్స్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. షమీ సంపాదన ఎంతో తెలుసా?

PREV
16
హ్యాపీ బర్త్ డే మహ్మద్ షమీ

భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ 2025 సెప్టెంబర్ 3న 35 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1990లో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించిన షమీ, 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. దాదాపు 12 సంవత్సరాలుగా భారత బౌలింగ్ దళంలో కీలక స్థానాన్ని సంపాదించారు. 

అద్భుతమైన బౌలింగ్ తో కొత్త బంతి, పాత బంతి రెండింటితోనూ సమానంగా వికెట్లు తీసే సామర్థ్యం ఆయనకు ప్రత్యేక స్థానం సంపాదించిపెట్టింది. ప్రపంచకప్‌లు, విదేశీ టెస్ట్ మ్యాచ్‌లు, వన్డేలు ఇలా భారత జట్టు విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కూడా తనదైన ముద్ర వేశారు.

DID YOU KNOW ?
ప్రపంచ కప్ లో షమీ రికార్డులు
2023 వన్డే ప్రపంచ కప్‌లో షమీ కేవలం 7 మ్యాచ్‌లలోనే 24 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్ గా నిలిచారు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ పరంగా) 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. కేవలం 17 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించారు, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టారు.
26
అద్భుతమైన బౌలింగ్ తో రికార్డుల మోత మోగించిన మహ్మద్ షమీ

షమీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 462 వికెట్లు తీశారు. ఇందులో 12 సార్లు ఐదు వికెట్ల మైలురాయి నమోదు చేశారు. షమీ బౌలింగ్ రికార్డులు గమనిస్తే..

• భారత ఆటగాళ్లలో అత్యుత్తమ వన్డే బౌలింగ్ ఫిగర్స్ 7/57 వికెట్లు

• ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యుత్తమ ఫిగర్స్ 7/57 వికెట్లు

• ఐసీసీ టోర్నమెంట్లలో ఐదు సార్లు 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ షమీ

• వేగంగా 100, 150, 200 వన్డే వికెట్లు అందుకున్న భారత బౌలర్ షమీ

• ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్ షమీ.

• 2023 ఐపీఎల్‌లో 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ విజేత షమీ

• ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు 55 వికెట్లు తీసి, సగటు 13.52తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.

36
మహ్మద్ షమీ నెట్‌వర్త్ ఎంత? బీసీసీఐ కాంట్రాక్ట్ వివరాలు

మహ్మద్ షమీ నెట్‌వర్త్ ప్రస్తుతం రూ. 55 నుండి రూ. 65 కోట్లు (సుమారు 7–8 మిలియన్ డాలర్లు)గా అంచనా. ఆయన ఆదాయంలో పెద్ద భాగం బీసీసీఐ సాలరీ, మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారానే వస్తోంది.

• బీసీసీఐ గ్రేడ్ A ప్లేయర్‌గా షమీకి సంవత్సరానికి రూ. 5 కోట్లు రిటైనర్ ఫీజు వస్తుంది.

• ఒక టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, ఒక వన్డేకు రూ. 6 లక్షలు, ఒక టీ20కి రూ. 3 లక్షలు ఫీజు అందుతుంది.

46
షమీకి ఐపీఎల్ డీల్స్ నుంచి వచ్చే ఆదాయం ఎంత?

ఐపీఎల్ కూడా షమీ కెరీర్‌లో కీలక ఆదాయ వనరుగా ఉంది. మొదటి సీజన్‌లో ఆయన ధర కేవలం రూ. 10 లక్షలు మాత్రమే. కానీ క్రమంగా ఆయన విలువ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.10 కోట్లకు పైనే అందుకుంటున్నారు.

• 2025 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆయనను ₹10 కోట్లకు కొనుగోలు చేసింది.

• ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా ఆయన సంపాదన ₹50 కోట్లకు పైగా చేరింది.

• 2023 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలవడంతో షమీ విలువ మరింత పెరిగింది.

56
షమీ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు - లగ్జరీ లైఫ్

షమీ అనేక ప్రముఖ బ్రాండ్లకు అంబాసడర్‌గా ఉన్నారు. వీటి నుంచి కూడా భారీగానే సంపాదిస్తున్నారు.

• నైక్, ప్యూమా, సియాట్ టైర్స్, SS, బ్లిట్జ్‌పూల్స్, విజన్11, OctaFX, Hell Energy వంటి బ్రాండ్లతో ఆయన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

• ఒక్కో బ్రాండ్‌ నుంచి ఆయనకు సుమారు రూ. 1 కోటి వస్తుంది.

• వార్షికంగా ఎండోర్స్‌మెంట్ల ద్వారా రూ. 3 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు.

క్రికెట్ కాకుండా ఆయన రియల్ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టారు. అమ్రోహాలోని ఆయన విలాసవంతమైన ఫార్మ్‌హౌస్ విలువ రూ. 12 నుంచి15 కోట్లుగా ఉంటుంది. కార్ల ఫ్లీట్‌లో BMW 5 సిరీస్, Jaguar F-Type, Audi, Toyota Fortuner ఉన్నాయి.

66
షమీ వ్యక్తిగత జీవితం

షమీ వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలిచింది. భార్య హసీన్ జహాన్‌తో విడాకుల తర్వాత ఆయన భారీగానే భరణం చెల్లిస్తున్నారు. పలు రిపోర్టుల ప్రకారం.. ఇప్పటివరకు ఆయన సుమారు రూ.3.36 కోట్ల భరణం చెల్లించారు. నెలకు ₹1.5 లక్షలు మాజీ భార్యకు, ₹2.5 లక్షలు కూతురి కోసం చెల్లిస్తున్నారు.

గాయాల కారణంగా షమీ కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నారు. ఆయన చివరిసారి భారత తరపున న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడారు. ప్రస్తుత ఆసియా కప్ స్క్వాడ్‌లో ఆయన లేరు. అయితే ఫిట్‌నెస్ సాధించిన తర్వాత తిరిగి జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories