India vs Srilanka: ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు, వన్డేలలో ఆడిన అశ్విన్ ఆ తర్వాత గాయంతో వైదొలిగాడు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్, శ్రీలంకతో టీ20 పర్యటనలకు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు..
ఈనెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు ఆడనున్న టీమిండియా.. టీ20 సిరీస్ మాదిరే టెస్టులలో కూడా లంకకు నిరాశ మిగిల్చేందుకు సిద్ధమవుతున్నది.
28
అయితే ఉపఖండం పిచ్ లలో కీలకంగా వ్యవహరించే స్పిన్నర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మొహాలీ టెస్టు ఆడతాడా..? లేదా..? అనేది ఇప్పుడు అభిమానులను మదిని తొలిచివేస్తున్న ప్రశ్న..
38
ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టులతో పాటు వన్డే సిరీస్ లో కూడా ఆడిన అశ్విన్.. గాయంతో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్ తో పాటు లంకతో కూడా టీ20 సిరీస్ కు అందుబాటులో లేడు.
48
కానీ లంకతో టెస్టులకు మాత్రం అతడికి అవకాశమిచ్చింది బీసీసీఐ. జట్టులో సభ్యుడిగా ఎంపిక చేసినా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అశ్విన్ కు తుది జట్టులో చోటు దక్కనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. రవిచంద్రన్ అశ్విన్ ఫిట్నెస్ పై కీలక అప్డేట్ ఇచ్చాడు.
58
లంకతో టెస్టు సిరీస్ కు ముందు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బుమ్రా మాట్లాడుతూ .. ‘అశ్విన్ పూర్తి ఫిట్నెస్ తో ఉన్నాడు. ఆ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఇవాళ ట్రైనింగ్ సెషన్ లో కూడా మాతో పాల్గొన్నాడు.
68
బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ సెషన్ లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. మ్యాచ్ వరకల్లా అశ్విన్ ఇంకా మెరుగవుతాడని నమ్మకముంది..’ అని తెలిపాడు.
78
ఇదిలాఉండగా మొహాలీ లో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కు సంబంధించిన పలు ఫోటోలను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది. ఈ ఫొటోలలో అశ్విన్.. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేస్తూ ఉత్సాహంగా కనిపించాడు.
88
అశ్విన్ తో పాటు ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఫిట్ గా ఉన్నారని.. ఇప్పటివరకైతే ఎటువంటి అవరోధాలు లేవని బుమ్రా చెప్పుకొచ్చాడు.