14 ఏళ్లుగా టీమిండియాలో, క్రికెట్ ప్రపంచంలో లెజెండ్‌గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో కేవలం ప్లేయర్‌గా ఆడుతున్నాడు...
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్, హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో రాణించాడు...
29
మూడు టీ20ల్లోనూ అజేయంగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, లంకతో టీ20సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలిచాడు...
39
దీంతో విరాట్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఆడించి, కోహ్లీని రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయిస్తే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్...
49
‘లెక్కకు మించి ప్లేయర్లు అందుబాటులో ఉండి, ఎవ్వరిని ఆడించాలో తెలియకపోవడం చాలా గొప్ప సమస్యే... అయితే విరాట్ కోహ్లీకి ఎవ్వరూ పోటీ రారు, కారు...
59
ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ స్థానం అతనిదే. టీ20ల్లో విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లోనే రావాలి. శ్రేయాస్ అయ్యర్‌ను నాలుగో స్థానంలో లేదా ఐదో స్థఆనంలో వాడొచ్చు...
69
సూర్యకుమార్ యాదవ్ కూడా అదరగొడుతున్నాడు. కాబట్టి యాదవ్‌కి కూడా తుదిజట్టులో చోటు కల్పించాలి. ఈ ఇద్దరి మధ్యే పోటీ ఉంటుంది...
79
బౌలింగ్‌లో కూడా టీమిండియాకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే బ్యాటింగ్ చేయగల బౌలర్లు అందుబాటులో ఉంటే, వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి...
89
మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌ల బౌలింగ్ గురించి బ్యాటర్లకు పెద్దగా అవగాహన లేదు. అలాంటి సమయాల్లో శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో వికెట్లు తీయలేకపోయినా పెద్దగా ప్రభావం పడదు...
99
ఆల్‌రౌండర్లు జట్టులో ఉండడం ఏ టీమ్‌కైనా అదృష్టమే... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..