న్యూజిలాండ్‌ కూడా డౌటే... డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇండియాతో పాటు ఆ మూడు జట్లు...

Published : Mar 01, 2022, 04:09 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో ఇంగ్లాండ్ జట్టు అనేక కష్టాలు పడుతోంది. ఇప్పటికే 9 మ్యాచులు ఆడి ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే అద్భుతం చేయాల్సిందే...

PREV
111
న్యూజిలాండ్‌ కూడా డౌటే... డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇండియాతో పాటు ఆ మూడు జట్లు...

స్వదేశంలో ఇంగ్లాండ్‌ను యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా జట్టు, డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో రెండో పొజిషన్‌లో ఉంది...

211

మార్చి 4 నుంచి పాకిస్తాన్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడే ఆస్ట్రేలియా, ఆ తర్వాత జూన్‌లో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది...

311

అక్టోబర్‌లో భారత్‌లో టీమిండియాతో కలిసి నాలుగు టెస్టు సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత నవంబర్ నెలలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. 

411

వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో మూడు టెస్టులు ఆడడంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021-23 షెడ్యూల్ పూర్తవుతుంది. ఆస్ట్రేలియా ఫైనల్‌కి చేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...

511

వెస్టిండీస్‌ను రెండు టెస్టుల్లో చిత్తు చేసిన శ్రీలంక జట్టు, ప్రస్తుతం 100 శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. అయితే ఈ నెలలో టీమిండియాతో సిరీస్‌ నెగ్గడం లంకకు అంత తేలికయ్యే పని కాదు...

611

మే నెలలో బంగ్లాదేశ్‌తో, ఆ తర్వాత పాకిస్తాన్, న్యూజిలాండ్ వంటి జట్లతో సిరీస్ ఆడే శ్రీలంక జట్టు... ఫైనల్ చేరుకోవాలంటే అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది...

711

పాకిస్తాన్ జట్టు నాలుగింట్లో మూడు టెస్టు గెలిచి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అయితే ఈ నెలలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడే పాక్, ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక వంటి జట్లతో సిరీసులు ఆడనుంది. పాక్ ఫైనల్ చేరాలంటే ఆసీస్ టెస్టు సిరీస్‌లో పర్ఫామెన్స్‌ కీలకంగా మారనుంది...

811

సౌతాఫ్రికా ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. భారత్‌తో ఒకటి, న్యూజిలాండ్‌తో ఓ టెస్టు ఓడిన సఫారీ జట్టు... బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది...

911

మిగిలిన జట్లతో పోలిస్తే టీమిండియాకి మున్ముందు పెద్ద ఛాలెంజింగ్ సిరీసులేమీ లేవు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో ఓ టెస్టు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు టెస్టులు ఆడనుంది టీమిండియా...

1011

ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడుతుంది. స్వదేశంలో భారత జట్టు టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉంది. ఆ ఫామ్‌ని కొనసాగిస్తే ఈసారి కూడా భారత జట్టు ఫైనల్ చేరడం ఖాయం...

1111

ఈ సీజన్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో పోలిస్తే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం పోటీపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

click me!

Recommended Stories