Cricket: ఇంగ్లాండ్-భారత్ మూడో వన్డే మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక తాజాగా గిల్ భారత స్టార్ సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను దాటేశాడు.
Cricket: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత వన్డే వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలోనే గిల్ కు గుడ్ న్యూస్ అందింది. విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మను గిల్ దాటేశాడు. ఇప్పుడు పాక్ ప్లేయర్ బాబర్ ఆజంకు షాక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడు.
25
Shubman Gill
ఐసీసీ ర్యాకింగ్స్ లో అదరగొట్టిన శుభ్ మన్ గిల్
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో గిల్ టాప్ ప్లేస్ కు దగ్గరగా వచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను దాటేశాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలోకి వెళ్లాడు. పాక్ ప్లేయర్ బాబర్ అజామ్ 786 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మను రెండో స్థానం నుంచి వెనక్కి నెట్టి గిల్ ఒక స్థానం మెరుగుపరుచుకున్నాడు. ఇప్పుడు గిల్ ఖాతాలో 781 పాయింట్లు ఉన్నాయి. ఈ సిరీస్ లో మంచి ఇన్నింగ్స్ లు ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ కూడా టాప్-10లోకి ప్రవేశించాడు. గిల్, రోహిత్, కోహ్లీలతో పాటు టాప్-10లో చేరాడు.
35
Rohit Sharma, Shubman Gill, Virat Kohli,
రోహిత్, కోహ్లీలు పడిపోయారు !
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీలు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కిందకు పడిపోయారు. రోహిత్ ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి, విరాట్ రెండు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి సెంచరీ కొట్టాడు. మూడో వన్డేలో నిరాశపరిచాడు. కేవలం 1 పరుగుకే ఔట్ అయ్యాడు.
45
Image Credit: Getty Images
విరాట్ ను దాటేసిన ఐరిష్ ప్లేయర్
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు పడిపోయాడు. దీంతో ఐర్లాండ్‌కు చెందిన హ్యారీ టెక్టర్ ఇప్పుడు కోహ్లీని దాటేశాడు. టెక్టర్ నాల్గవ స్థానానికి చేరాడు.
అతని తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ ఐదవ స్థానంలో ఉన్నాడు. విరాట్ అతని కంటే దిగువన ఆరో స్థానంలో ఉన్నాడు. శ్రేయాస్ 10వ స్థానంలో ఉన్నాడు.
55
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ - బ్యాటింగ్
1. బాబర్ ఆజం (పాకిస్తాన్)- 786 రేటింగ్ పాయింట్లు
2. శుభ్‌మన్ గిల్ (ఇండియా)- 781 రేటింగ్ పాయింట్లు
3. రోహిత్ శర్మ (ఇండియా)- 773 రేటింగ్ పాయింట్లు
4. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్)- 737 రేటింగ్ పాయింట్లు
5. హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)- 736 రేటింగ్ పాయింట్లు
6. విరాట్ కోహ్లీ (ఇండియా)- 728 రేటింగ్ పాయింట్లు
7. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 721 రేటింగ్ పాయింట్లు
8. షాయ్ హోప్ (వెస్టిండీస్)- 672 రేటింగ్ పాయింట్లు
9. రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్)- 672 రేటింగ్ పాయింట్లు
10. శ్రేయాస్ అయ్యర్ (ఇండియా)- 669 రేటింగ్ పాయింట్లు