Published : Feb 12, 2025, 06:16 PM ISTUpdated : Feb 12, 2025, 06:18 PM IST
Virat Kohli: ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే, విరాట్ కోహ్లీ ఒక బౌలర్ చెప్పి మరీ మరోసారి ఔట్ చేశాడు.
Virat Kohli: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో భారత జట్టు మూడో వన్డే ఆడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్ ను అందుకున్నాడు.
విరాట్ కోహ్లీకి ఇది 73వ హాఫ్ సెంచరీ. మంచి క్లాసిక్ గేమ్ ఆడుతున్న కింగ్ కోహ్లీ సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, హాఫ్ సెంచరీ తర్వత కోహ్లీ ఔట్ అయ్యాడు. అయితే, గత కొన్ని మ్యాచ్ లు గా విరాట్ కోహ్లీని ఒక బౌలర్ చెప్పిమరీ ఔట్ చేస్తున్నాడు.
25
Image Credit: Getty Images
మంచి టచ్ లో కింగ్ కోహ్లీ
ఈ మ్యాచ్ లో క్రీజులోకి వచ్చినప్పటికీ నుంచి విరాట్ కోహ్లీ మంచి టచ్ లో కనిపించాడు. తనదైన షాట్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరిన్ని పరుగులు ఆశించిన ఇండియాకు, క్రికెట్ లవర్స్ కు నిరాశే ఎదురైంది. కోహ్లీ 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
విరాట్ తన వన్డే కెరీర్‌లో 51వ సెంచరీ సాధిస్తాడని అనిపించింది, కానీ అతను ఆదిల్ రషీద్ చేతికి చిక్కాడు. ఆదిల్ బౌలింగ్ లో కోహ్లీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ కు క్యాచ్ క్రీజు నుంచి వెనుదిరిగాడు.
35
Image Credit: Getty Images
ఆదిల్ రషీద్ బౌలింగ్ వరుసగా వికెట్ కోల్పోతున్న విరాట్ కోహ్లీ
ఈ సిరీస్ లో మరోసారి కింగ్ కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ చేతి చిక్కి పెవిలియన్ కు చేరాడు. వన్డే క్రికెట్ లో కోహ్లీని ఆదిల్ అవుట్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ లెజెండరీ ఇంగ్లాండ్ స్పిన్నర్ వన్డేలో ఐదవసారి విరాట్‌ను తన బాధితుడిగా చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ చాలా సార్లు ఆదిల్ రషీద్ లెగ్ స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతూనే ఉన్నాడు. అహ్మదాబాద్‌లో ఇది కనిపించింది. ఒకసారి ఆదిల్ అతనికి వ్యతిరేకంగా LBW కోసం బలమైన అప్పీల్ కూడా చేసాడు, కానీ విరాట్ ఆ సమయంలో తప్పించుకున్నాడు.
45
Image Credit: Getty Images
కోహ్లీని 10 సార్లు ఔట్ చేసిన ఆదిల్ రషీద్
కోహ్లీ ఇప్పటివరకు 10 వన్డే ఇన్నింగ్స్‌లలో ఆదిల్ రషీద్ బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో అతను 130 బంతుల్లో 112 పరుగులు చేశాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీని ఆదిల్ రషీద్ 5 సార్లు ఔట్ చేశాడు. మొత్తంగా 11 సార్లు కోహ్లీని పెవిలియన్ కు పంపాడు.
ఆదిల్ పై విరాట్ సగటు 22.40, స్ట్రైక్ రేట్ 86.15గా ఉంది. ఈ గణాంకాలను చూస్తే వన్డేల్లో ఆదిల్ రషీద్ బౌలింగ్ ను విరాట్ కోహ్లీ ఎదుర్కోవడానికి ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో తెలుస్తోంది.
2024 నుండి వన్డేలలో లెగ్ స్పిన్‌పై విరాట్ రికార్డు గొప్పగా లేవు. లెగ్ స్పిన్ బౌలింగ్ లో పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ కు చేరాడు.
ఇన్నింగ్స్: 4
బంతులు: 40
పరుగులు: 26
అవుట్లు: 4
55
గిల్ తో సెంచరీ భాగస్వామ్యంతో మెరిసిన కోహ్లీ
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండో ఓవర్ తొలి బంతికే రోహిత్‌ను వికెట్ కోల్పోయింది భారత్. రోహిత్ రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. విరాట్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి టీమిండియాను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (52 పరుగులు), గిల్ సెంచరీ (112 పరుగులు) చేశారు. వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్ 78 పరుగులు, కేఎల్ రాహుల్ 40 పరుగులు చేయడంతో భారత్ 356 పరుగులకు ఆలౌట్ అయింది.