8 సిక్సర్లు, 7 ఫోర్లు... జింబాబ్వే బౌలింగ్ ను ఉతికిపారేస్తూ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ

First Published | Jul 7, 2024, 7:00 PM IST

ZIM vs IND, Abhishek Sharma Century : తన తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్న అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపించాడు. జింబాబ్వే బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ త‌న తొలి సెంచరీ సాధించాడు. దీంతో టీ20ల్లో సెంచరీ కొట్టిన భార‌త 10వ బ్యాట్స్‌మెన్‌గా ఘ‌న‌త సాధించాడు. 
 

Abhishek Sharma

ZIM vs IND, Abhishek Sharma Century : ఐపీఎల్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ విధ్వంసక‌ర ఇన్నింగ్స్ లు ఆడిన అభిషేక్ శ‌ర్మ అంత‌ర్జాతీయ మ్యాచ్ లోనూ అదే జోరును చూపించాడు. జింబాబ్వే బౌలింగ్ ను ఊతికిపారేస్తూ సెంచ‌రీతో దుమ్మురేపాడు. తన తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో డ‌కౌడ్ అయిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపిస్తూ సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు.

Abhishek Sharma

జింబాబ్వే  బౌలింగ్ ను చెడుగుడు ఆడుకుంటూ సెంచరీ కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచ‌రీని సాధించాడు. భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన ప్లేయ‌ర్ల‌ క్లబ్‌లో చేరాడు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ కేవలం 46 బంతుల్లోనే వ‌రుస ఫోర్లు, సిక్సర్లు బాది సెంచరీ సాధించాడు.


అభిషేక్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీజింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 46 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాతి బంతికే బిట్ షాట్ ఆడ‌బోయి క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. అయితే, టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మూడో భారతీయుడిగా కేఎల్ రాహుల్ స‌ర‌స‌న చేరాడు అభిషేక్ నిలిచాడు.

అంత‌కుముందు, కేఎల్ రాహుల్ కూడా 46 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయ‌ర్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. కేవ‌లం 35 బంతుల్లోనే రోహిత్ సెంచ‌రీ కొట్టాడు. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు.

సిక్స‌ర్లే సిక్స‌ర్లు.. 

ఈ మ్యాచ్ లో భార‌త ప్లేయ‌ర్లు సిక్స‌ర్ల మోత మోగించాడు. అభిషేక్ శర్మ సిక్సర్‌తో తన ఖాతా తెరిచాడు. అలాగే, సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  చివ‌ర‌కు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు.

టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇది అతని రెండో ఇన్నింగ్స్ మాత్రమే. కాగా, దీపక్ హుడా సెంచరీ చేయడానికి 3 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ తన నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు.

Latest Videos

click me!