World Test Championship : వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ సెక్రటరీ జైషా ఆదివారం ఒక వీడియో సందేశంలో అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ శర్మ నాయకత్వంలో గెలుస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాపై ఐసీసీ టైటిల్ విజయం తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అవుట్‌గోయింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లకు ఈ విజయాన్ని అంకితం చేస్తూ జైషా మెన్ ఇన్ బ్లూకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
బీసీసీఐ సెక్రటరీ జైషా మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచ కప్ 2024 కోసం చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న టీమిండియాకు అభినందనలు. ఈ విజయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఏడాది కాలంలో ఇది ఇది మా మూడో ఫైనల్" అని అన్నారు.
అలాగే, "మేము జూన్ 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వెళ్లాము కానీ, అడుగు దూరంలో కోల్పోయాము. నవంబర్ 2023లో పది వరుస విజయాలతో మేము చాలా హృదయాలను గెలుచుకున్నాము, కానీ వన్డే ప్రపంచ కప్‌ను గెలవలేకపోయాము. 2024 జూన్‌లో కప్ గెలుస్తాము అని నేను రాజ్‌కోట్‌లో చెప్పాను... భారత జెండాను ఎగురవేస్తామని అన్నాను.. కెప్టెన్ సరిగ్గా అదే చేశారు" అని ప్రశంసలు కురిపించారు.
టీ20 ప్రపంచ కప్ 2024 పైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కీలక సమయంలో వికెట్లు తీయగా, సూర్యకుమార్ యాదవ్ బౌండరీలైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ తో భారత్ ను విజయతీరాలకు చేర్చారని జైషా కొనియాడారు.
Rohit Sharma-Virat Kohli Hug
"ఫైనల్‌లో చివరి ఐదు ఓవర్లు ఈ విజయానికి పెద్ద సహకారం అందించాయి. దీనిని సాధించిన సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.
రోహిత్ సారథ్యంలో మరో రెండు టైటిళ్లను గెలవడానికి భారత్ ప్రయాణం సాగిస్తోంనీ, వచ్చే ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.