IND vs SL : శ్రీలంక అగ్రెసివ్ ఛేజ్.. సూపర్ ఓవర్ థ్రిల్లర్

Published : Sep 27, 2025, 01:15 AM IST

India vs Sri Lanka Asia Cup 2025: భారత్-శ్రీలంక మధ్య సూపర్ ఫోర్ లో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. భారత్ ఉంచి 202/5 టార్గెట్ ను అందుకునే క్రమంలో శ్రీలంక ఆగ్రెసివ్ ఛేజ్ తో అదరగొట్టింది.

PREV
15
ఉత్కంఠభరిత ముగింపుతో సూపర్ ఓవర్

ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్స్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన 18వ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊపిరి బిగపట్టే ఉత్కంఠను అందించింది. సాధారణ ఇన్నింగ్స్‌లో స్కోర్లు సమంగా ముగియడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌లోకి వెళ్లింది.

భారత్ తొలుత 202/5 స్కోరు చేసింది. శ్రీలంక సమాధానంగా 20 ఓవర్లలో 202/5 చేసింది. దీంతో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి చేరింది. ఇది ఆసియా కప్ చరిత్రలో మొదటి సూపర్ ఓవర్.

సూపర్ ఓవర్ లో శ్రీలంక 2-2 పరుగులు చేసింది. భారత్ సూపర్ ఓవర్ లో తొలి బంతికే మూడు పరుగులు చేసి విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ విన్నింగ్ పరుగులు చేశాడు.

25
అభిషేక్ శర్మ అదరగొట్టేశాడు.. పాతుమ్ నిస్సంక సునామీ

భారత్ టాస్ ఓడింది. శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించింది. ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61 పరుగులు చేశారు. తిలక్ వర్మ 49 (34 బంతులు నాటౌట్), సాంజు శాంసన్ 39 (23 బంతులు), అక్షర్ పటేల్ 21 (15 బంతులు నాటౌట్) పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. భారత్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 203 పరుగుల లక్ష్యం ఉంచింది.

శ్రీలంక తరఫున పతుం నిస్సంక అద్భుత సెంచరీ సాధించారు. ఆయన 58 బంతుల్లో 107 పరుగులు చేశారు. కుసల్ పెరేరా 32 బంతుల్లో 58 రన్స్ చేశారు. కానీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కుసల్ మెండిస్ 0, చరిత్ అసలంక 5, కమిందు మెండిస్ 3 రన్స్ చేసి త్వరగా ఔటయ్యారు. చివరలో దసున్ శనక 22*, జెనిత్ లియాంజె 2* చేశారు. 20 ఓవర్లలో 202/5 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరింది.

35
సూపర్ ఓవర్ ఉత్కంఠ

సూపర్ ఓవర్‌లో శ్రీలంక నుంచి కుసల్ పెరేరా, దసున్ శనక బ్యాటింగ్ చేశారు. భారత్ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆరు బంతుల్లో 2 వికెట్లు తీసి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో భారత్‌ ముందు 3 పరుగుల లక్ష్యం ఉంచింది.

భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. వనిందు హసరంగ బౌలింగ్ ప్రారంభించారు. మొదటి బంతిపైనే సూర్యకుమార్ 3 పరుగులు పూర్తి చేసి భారత్‌కు విజయం అందించారు.

45
ఇరు జట్ల బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంది?

ఈ మ్యాచ్ లో బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే, కీలక సమయంలో వికెట్లు పడటం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేచేశాయి. భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. శ్రీలంక తరఫున మహీష్ తిక్షణ, దుష్మంత చమీ్రా, వనిందు హసరంగ, దసున్ శనక, చరిత్ అసలంక తలా ఒక వికెట్ తీశారు. బ్యాటర్లు మంచి నాక్ లు ఆడారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, శ్రీలంక టీమ్ లో నిస్సంక సునామీ బ్యాటింగ్ తో అదరగొట్టారు.

55
నిస్సంక సెంచరీ వృథా

ఈ మ్యాచ్‌లో భారత్ 202 పరుగులు చేసి ఆసియా కప్ 2025లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. అదే మ్యాచ్‌లో శ్రీలంక కూడా 202 పరుగులు చేసి తమ అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్ రికార్డును సృష్టించింది. అంతకు ముందు ఆసియా కప్ 2025లో అఫ్గానిస్తాన్ 188 పరుగులు చేయడం అత్యధిక స్కోర్ గా ఉంది. ఈ మ్యాచ్‌తో భారత్ ఆసియా కప్ 2025లో వరుసగా ఆరు విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోలేదు. 

పతుం నిస్సంక ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 పరుగులు చేశారు. ఇది ఆయన మొదటి టి20 ఇంటర్నేషనల్ సెంచరీ కావడం విశేషం. కానీ అతని సెంచరీ వృథా అయింది. చివరికి సూపర్ ఓవర్‌లో భారత్ విజయం సాధించింది. కాగా, భారత్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆదివారం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories