Abhishek Sharma: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత జట్టు సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ టీమ్ పై ధనాధన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ టీ20ల్లో 6000 పరుగుల మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిపిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డుల వేట మొదలుపెట్టాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. తన కెరీర్‌లో మరో మైలురాయి దాటేశాడు. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 6000 పరుగులు పూర్తి చేసిన రెండో ప్రపంచ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.
25
బంతుల లెక్కన వరల్డ్ రికార్డ్: ఆండ్రీ రస్సెల్‌నే దాటేసిన అభిషేక్ శర్మ
పవర్ హిట్టింగ్‌కు పర్యాయపదంగా మారిన అభిషేక్ శర్మ 6000 టీ20 పరుగులను చేరుకోవడానికి కేవలం 3420 బంతులు మాత్రమే తీసుకున్నాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ (3386 బంతులు) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు. ఈ ఘనత సాధించే క్రమంలో విండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (3550 బంతులు), ఆస్ట్రేలియా ప్లేయర్ టిమ్ డేవిడ్ (3681 బంతులు), ఇంగ్లాండ్ స్టార్స్ విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ (3857 బంతులు)లను అభిషేక్ వెనక్కి నెట్టేశాడు. గతంలోనే వేగంగా 5000 టీ20 పరుగులు, 1000 T20I పరుగులు చేసిన రికార్డులు కూడా ఇతని ఖాతాలోనే ఉండటం విశేషం.
35
తొలుత తడబడ్డ ఆఫ్ఘనిస్తాన్: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అర్షదీప్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు గట్టి షాకే ఇచ్చారు. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ పరుగులేమీ చేయకుండానే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్‌ప్లేలోనే ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అయితే అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (44 బంతుల్లో 64 నాటౌట్), నిలకడగా ఆడిన మహ్మద్ నబీ (27 బంతుల్లో 33) 83 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లతో చెలరేగగా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ 156 పరుగులకే పరిమితమైంది.
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ సంజూ శాంసన్ (8 పరుగులు) త్వరగానే అవుట్ అయినా, ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా అభిషేక్ శర్మ కంట్రోల్‌లోకి వచ్చింది. మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడిన అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 32 బంతులు ఎదుర్కొన్న ఇతను 82 పరుగులతో వీరవిహారం చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 42 పరుగులతో చక్కటి సహకారం అందించాడు.
55
మొదటి T20లో భారత్ ఘన విజయం: సిరీస్‌లో 1-0 ఆధిక్యం
అభిషేక్ శర్మ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓపెనర్లు వేసిన బలమైన పునాదితో భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని ఛేదించింది. చివరిలో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మిగిలిన పని పూర్తి చేయడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.