India Pakistan tensions: పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దెబ్బకొట్టిన ఆపరేషన్ సింధూర్.. ఇక కష్టమే !

Published : May 11, 2025, 12:47 AM ISTUpdated : May 11, 2025, 12:50 AM IST

India Pakistan tensions: పాకిస్థాన్‌ క్రికెట్ పై భారత్ దెబ్బ గట్టిగానే పడింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల అక్కడి క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ ఇప్పుడు కోలుకోని విధంగా 5 గట్టి దెబ్బలు తగిలాయి. ఈ వివరాలు ఇప్పుడు గెలుసుకుందాం.

PREV
16
India Pakistan tensions: పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దెబ్బకొట్టిన ఆపరేషన్ సింధూర్.. ఇక కష్టమే !

India Pakistan tensions: ఆపరేషన్ సింధూర్ తో మరోసారి పాకిస్థాన్‌కు జీవితాంతం మరవలేని గుణపాఠం చెప్పింది భారత్. మన సైన్యం ఉగ్రవాదులను మాత్రమే కాకుండా, వారి వెనుక ఉన్న వారిని కూడా శిక్షించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును సైతం గట్టిగానే దెబ్బకొట్టింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు జరిగిన ఐదు  బిగ్ నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

26
1. పాక్ స్టేడియం దెబ్బతినడం

భారత్ పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి చేసింది, దీనివల్ల అది దెబ్బతింది. ఈ నష్టం కారణంగా అక్కడ జరగాల్సిన PSL మ్యాచ్ కూడా రద్దు చేశారు. ఈ స్టేడియాన్ని ఇటీవలే 400 కోట్ల భారతీయ రూపాయలతో నిర్మించిన్ సంగతి తెలిసిందే. 

36
2. భారత్-పాక్ క్రికెట్ పై ప్రభావం

భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ బ్లాక్ బస్టర్. కానీ, ఇప్పుడు దానిపై కూడా ప్రమాదం పొంచి ఉంది. పాకిస్థాన్ ప్రవర్తన కారణంగా BCCI పాక్ తో టోర్నమెంట్లు ఆడలేకపోతుంది. ICC టోర్నమెంట్లలో రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచకపోవచ్చు. అలాగే, భారత్ పాకిస్తాన్ తో ఐసీసీ టోర్నీలలో కూడా ఆడకూడదని చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. 

46
3. విదేశీ క్రికెటర్ల కష్టాలు

భారత దాడి వల్ల పాకిస్థాన్ క్రికెటర్ల పరిస్థితి దారుణంగా ఉంది, అక్కడ PSL కోసం వెళ్ళిన విదేశీయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారు ఎలాగైనా పాకిస్థాన్ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. PCB ఇకపై PSL నిర్వహించే ధైర్యం చేయలేకపోవచ్చు.

56
4. PSL దుబాయ్ కి మార్పు

పాకిస్థాన్‌లో భద్రత లేకపోవడం, అక్కడి పరిస్థితుల దృష్ట్యా PCB PSLను దుబాయ్‌కు మార్చాలని నిర్ణయించింది. మిగిలిన మ్యాచ్‌లన్నీ అక్కడే జరుగుతాయి. అయితే, దుబాయ్ ఖర్చులు పాకిస్థాన్ కంటే చాలా ఎక్కువ. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. 

66
5. PCB ఆర్థిక ఇబ్బందులు

ఇప్పటికే PCB ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అక్కడి స్టేడియంలకు ప్రేక్షకులు రావడం లేదు, ఇప్పుడు మ్యాచ్‌లే నిలిచిపోయాయి. దీంతో వారి ఇబ్బందులు మరింత పెరిగాయి. భవిష్యత్తులో భారత్ దయ కోసం వారు వేడుకోవాల్సి రావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories