ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ కు జట్టును బిసిసిఐ త్వరలో ప్రకటించనుంది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు రోహిత్ శర్మ ప్రకటించాడు.
25
టెస్ట్ క్రికెట్ కు రోహిత్ వీడ్కోలు
ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని బిసిసిఐకి తెలియజేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో కోహ్లీ ఫామ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
35
కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరణ
అయితే కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరించిందని, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై బీసీసీఐ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దేశవాళీ టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాలని ఆదేశించింది.
55
కోహ్లీ నిర్ణయంతో అభిమానులు షాక్
ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, అతను అత్యుత్తమ ఆటగాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.