ఎయిర్‌స్పేస్‌పై ఆంక్షలు, వాయుసేన హడావిడి. పఠాన్‌కోట్, జమ్మూ, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో గగనతల హెచ్చరికల మధ్య విమాన రాకపోకలు నిలిపివేశారు. దీంతో పంజాబ్, ఢిల్లీ జట్లతో పాటు బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బందిని వందే భారత్ ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలించారు.
మూడు నగరాల్లో ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్ లు
ఐపీఎల్ ను తిరిగి తాత్కాలికంగా వాయిదా వేయగా, వారం తర్వాత తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మూడు దక్షిణ భారత నగరాలను ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు ఎంపిక చేసిందని సమాచారం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను ఈజీగా చేరుకునే గమ్యస్థానాలుగా గుర్తించి, మిగిలిన 16 మ్యాచ్‌లు అందులో క్వాలిఫయర్‌లు, ఎలిమినేటర్, ఫైనల్ లను ఈ మూడు వేదికల్లోనే నిర్వహించే అవకాశముంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం మాత్రమే ఖచ్చితమైన షెడ్యూల్ ఖరారవుతుంది.