IPL 2025 Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ప్రదర్శన కొనసాగుతోంది. వరుస ఓటములతో ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. సొంత గ్రౌండ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. చెన్నై ఓటమికి ముగ్గురు ప్లేయర్లు పెద్ద విలన్లుగా మారారు.
IPL 2025 Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మరో దారుణ ఓటమిని చవిచూసింది. వారి సొంత గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. శుక్రవారం (ఏప్రిల్ 25) చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 43వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో ఏడో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత, చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలనే ఆశలు సన్నగిల్లాయి. ఏదైనా అద్భుతం జరిగితేనే చెన్నై ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.
25
3 big villains of Chennai's defeat against srh, cheating of 16 crores, sank CSK's boat in IPL 2025
చెన్నై జట్టు 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో 10వ స్థానంలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇప్పుడు సీఎస్కే మిగిలిన ఐదు మ్యాచ్‌లను ఎలాగైనా గెలవాలి. దీనితో పాటు, చెన్నై ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడుతుంది.
ఈ సీజన్‌లో చెన్నై జట్టు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై మాత్రమే గెలిచింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో సీఎస్కే ఓటమిలో ముగ్గురు ప్లేయర్లు విలన్లుగా మారారు. వారి కోసం ఐపీఎల్ 2025లో సీఎస్కే కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
35
సామ్ కరాన్
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సామ్ కరాన్ గత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌లో ఉన్నాడు. అప్పట్లో అతన్ని పంజాబ్ టీమ్ రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. అయితే, ఈ సీజన్ కోసం మెగా వేలంలో చెన్నై టీమ్ అతన్ని రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్ నుంచే సామ్ కరాన్ కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కింది. కానీ, మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో బెంచ్ కు పరిమితం చేశారు.
అయితే, ఇప్పుడు సన్‌రైజర్స్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11లో చోటుదక్కింది. కానీ, అతను బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ రాణించలేదు. మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కేవంల 10 బంతుల్లో 9 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 2 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సామ్ కరాన్ 3 మ్యాచ్‌లు ఆడి 21 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
45
దీపక్ హుడా
చెన్నై జట్టు ఎప్పుడూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై ఆధారపడుతుంది. వేలంలో కూడా అలాంటి ఎంపికలవైపే మొగ్గుచూపింది. సీనియర్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడాను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను సీఎస్కేలోకి వచ్చిన తర్వాత అజింక్య రహానే లాగా అతని కెరీర్ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని అందరూ భావించారు, కానీ అతను అందరినీ నిరాశపరిచాడు. మెగా వేలంలో రూ. 1.70 కోట్లు దక్కించుకున్న అతను ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేకపోయాడు. 7.25 సగటు, 74.36 స్ట్రైక్ రేట్‌తో కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు.
55
Shivam Dube (Photo: @ipl/X)
శివం దుబే
చెన్నై సూపర్ కింగ్స్ లో భారీ అంచనాలున్న ప్లేయర్ శివం దూబే. అతను ఈ సీజన్ లో ఇప్పటివరకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. గతసారి సంచలనం సృష్టించిన శివమ్ దూబే బ్యాట్ ఇప్పుడు పనిచేయడం లేదు. సీఎస్కే తరఫున 9 మ్యాచ్‌ల్లో 242 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఒక CSK బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. కానీ, సిక్సర్ల దూబే నుంచి సునామీ ఇన్నింగ్స్ లు రావడం లేదు. ఎస్ఆర్హెచ్ పై కూడా ఘోరంగా విలమయ్యాడు.
గత సీజన్‌లో శివం 162.30 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అది 133.70కి తగ్గింది. 17 ఫోర్లు, 13 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. గత సీజన్ లో ఇది రెట్టింపు గా ఉంది. శివమ్ బ్యాటింగ్‌లో దూకుడు లేకపోవడంతో చెన్నై బ్యాటింగ్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దూబేను చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది.