Cars: విదేశాల్లో దుమ్మురేపుతోన్న మేడిన్ ఇండియా కార్లు.. టాప్ వ‌న్‌లో ఏది ఉందంటే.?

Published : Apr 21, 2026, 03:54 PM IST

Cars: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి కార్ల ఎగుమతుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ముఖ్యంగా చిన్న కార్లు, కాంపాక్ట్ SUVలకు విదేశాల్లో భారీ డిమాండ్ పెరిగింది. ఈ మార్పు భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త దిశను చూపుతోంది. 

PREV
14
గ్లోబల్ మార్కెట్‌లో చిన్న కార్లకు పెరుగుతున్న డిమాండ్

ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో తక్కువ ఖర్చుతో, మంచి మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కారణంగా భారత కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఆ దిశగా మార్చుకుంటున్నాయి. తక్కువ ధర, సులభమైన మెయింటెనెన్స్, ఫ్యూయ‌ల్‌ ఆదా అన్నీ కలిపి భారత కార్లను విదేశాల్లో ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో చిన్న కార్లకు పెరుగుతున్న డిమాండ్

ఎక్స్‌పోర్ట్ విషయంలో మారుతి సుజుకీ ఇప్పటికీ ముందంజలో ఉంది. కంపెనీ దగ్గర చిన్న, బడ్జెట్ సెగ్మెంట్‌లో బలమైన కార్ల లైన్‌ప్ ఉండటం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో మంచి స్పందన వస్తోంది. ఈ ట్రెండ్ చూస్తే, భారత్‌లో తయారైన కార్లను అభివృద్ధి చెందిన దేశాలు కూడా స్వీకరిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

24
ఫ్రాన్స్క్‌, జిమ్మీ కార్లు సూపర్ హిట్

ఈ ఏడాది ఎక్స్‌పోర్ట్‌లో మారుతి సుజుకీ ఫ్రాన్క్స్ టాప్‌లో నిలిచింది. ఈ కారును సుమారు 90,186 యూనిట్లు విదేశాలకు పంపారు, ఇది గత సంవత్సరం కంటే 30%కు పైగా వృద్ధి కావ‌డం విశేషం. ఇదే సమయంలో మారుతి సుజుకీ జిమ్మీ కూడా భారీగా పాపులర్ అయింది. ఈ కారుకు 72,209 యూనిట్ల ఎక్స్‌పోర్ట్ నమోదైంది, దాదాపు 50% పెరుగుదల కనిపించింది. చిన్నదైనా బలమైన ఆఫ్‌రోడ్ SUVగా దీనికి మంచి ఆదరణ లభిస్తోంది.

34
ఇతర కార్లు కూడా మంచి ప్రదర్శన

SUVలతో పాటు ఇతర కార్లు కూడా ఎక్స్‌పోర్ట్‌లో బాగానే నిలుస్తున్నాయి. హ్యుండాయ్ వెర్నా, నిస్సాన్ మ్యాగ్నైట్ వంటి మోడళ్లు కూడా గ్లోబల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ పొందుతున్నాయి. అలాగే మారుతి సుజుకీ స్విఫ్ట్‌, బెలోనో, డిజైర్ వంటి చిన్న కార్లు కూడా ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

44
SUVల వైపు ఆటో ఇండస్ట్రీ మలుపు

ఈ ఏడాది గణాంకాలు చూస్తే, ఆటోమొబైల్ రంగం పూర్తిగా SUVలు, కాంపాక్ట్ కార్ల వైపు మళ్లినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వినియోగదారులు ఇప్పుడు తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించుకునే కార్లను ఎక్కువగా కోరుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో భారత్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మరింత బలపడే అవకాశం ఉంది. కంపెనీలు వివిధ దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడళ్లను రూపొందించడంపై దృష్టి పెడుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories