రోజూ ట్రాఫిక్‌లో ప్ర‌యాణం చేసే వారికి ఈ కారు ఓ వ‌రం.. క్యూట్ లుక్స్‌, అదిరిపోయే ప‌నితీరు

Published : Apr 18, 2026, 07:02 AM IST

Mini Car: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నార్వేకు ఓ కొత్త ఎల‌క్ట్రిక్ కారు ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తోంది. స్విట్జర్లాండ్‌లో డిజైన్ చేసి, ఇటలీలో తయారు చేసిన మైక్రోలినో అనే కారును మొద‌ట నార్వేలోనే లాంచ్ చేశారు. 

PREV
15
స్థానిక కంపెనీ భాగ‌స్వామ్యంతో

మైక్రోలినో కంపెనీ, నార్వేలో మైక్రోలినో నార్జ్ ఏఎస్ అనే స్థానిక భాగస్వామితో కలిసి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థ ప్రధానంగా కస్టమర్ సపోర్ట్, వాహనాల అమ్మకాలు, సర్వీస్, మెయింటెనెన్స్, వారంటీ సపోర్ట్ లాంటివి నిర్వహిస్తుంది. ఇది స్టేవేంజ‌ర్ ప్రాంతం కేంద్రంగా పని చేస్తోంది. స్థానికంగా సేవలు అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్లకు వేగంగా సపోర్ట్ లభిస్తుంది.

25
పాత స్టైల్, కొత్త టెక్నాలజీ

మైక్రోలినో డిజైన్ 1950ల కాలంలోని బబుల్ కార్ల నుంచి ప్రేరణ పొందింది. ముఖ్యంగా BMW Isetta స్టైల్‌ను ఆధునికంగా మార్చి తయారు చేశారు. ముందు భాగంలో ఓపెన్ అయ్యే ఒకే డోర్ ఈ కారు ప్ర‌త్యేక‌త‌గా చెప్పొచ్చు. ఇది చాలా చిన్న సైజ్‌లో ఉంటుంది. ఒక సాధార‌ణ కారు పార్కింగ్ స్థ‌లంలో ఇలాంటి 3 కార్ల‌ను పార్క్ చేయొచ్చు. ఇద్ద‌రు కూర్చునే సీటింగ్ ఇందులో ఉంటుంది. ఫ్రంట్ డోర్ “ఫ్రిజ్‌లా” ఓపెన్ అవుతుంది. ఇది నగరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు సరైన పరిష్కారంగా చెప్పొచ్చు.

35
బ్యాటరీ, రేంజ్, పనితీరు

మైక్రోలినో చిన్నదైనా పనితీరు బాగానే ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. మైక్రోలినో లైట్ గరిష్ఠ‌ వేగం గంట‌కు 45 కిలోమీట‌ర్ల‌తో వెళ్తుంది. కాగా మైక్రోలినో స్టాండ‌ర్డ్ గంట‌కు గ‌రిష్ఠంగా 90 కిలో మీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇక బ్యాటరీ ఆప్షన్స్ విష‌యానికొస్తే 5.5 kWh → ~95 km రేంజ్, 10.5 kWh → ~177 km రేంజ్, 15 kWh → ~228 km రేంజ్‌తో తీసుకొచ్చారు. ఇక ఈ కారు 0 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగాన్ని కేవ‌లం 5 సెక‌న్ల‌లో అందుకుటుంది. అలాగే బ్యాట‌రీ పూర్తిగా ఛార్జింగ్ కావ‌డాఇన‌కి 5.5 గంట‌లు ప‌డుతుంది. నగర ప్రయాణాలకు ఇది సరిపడే రేంజ్ ఇస్తుంది.

45
ఫీచర్లు – చిన్న కారు, పెద్ద సౌకర్యాలు

మైక్రోలినోలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ (కొత్త మోడల్‌లో AC కూడా), బ్లూటూత్ స్పీకర్ సపోర్ట్, స్మార్ట్‌ఫోన్ హోల్డర్, LED లైటింగ్, 230 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇక ఇందులోనే తీసుకొచ్చిన అప్‌డేటెడ్ వెర్ష‌న్‌లో ఏసీతో పాటు ప్రీమియం ఇంటీరియ‌ర్ ఇచ్చారు. అలాగే Spiaggina ఎడిషన్‌లో ఓపెన్ రూఫ్, బీచ్ స్టైల్ డిజైన్ అందించారు.

55
ఇంత‌కీ కారు ధ‌ర ఎంతంటే.?

ఈ కారు ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో లాంచ్ కాలేదు. అయితే నార్వేలో మైక్రోలినో ప్రారంభం ధ‌ర సుమారు €19,100గా ఉంటుంది. అంటే మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 16 ల‌క్ష‌లన్న‌మాట‌. టాప్ వేరియంట్ అయితే మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఇక ఇందులో లైట్ వెర్ష‌న్‌, Spiaggina ఎడిషన్ కూడా ఉన్నాయి. మొత్తం మీదీ మైక్రోలినో పెద్ద SUVలకు ప్రత్యామ్నాయం కాదు. కానీ నగరాల్లో చిన్న దూరాలకు, తక్కువ ఖర్చుతో, స్టైలిష్‌గా ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. చిన్న సైజ్, సరైన రేంజ్, సింపుల్ ఫీచర్లతో మ‌రీ ముఖ్యంగా రోజూ ట్రాఫిక్‌లో బైక్‌ల‌పై వెళ్లే వారికి ఇది నిజంగానే వ‌రం అని చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories