Maruti: భారత మార్కెట్‌లో చిన్న కార్ల విభాగంలో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించే మారుతి సుజుకీ ఇప్పుడు మరోసారి బడ్జెట్ కస్టమర్లను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మారుతి ఎస్-ప్రెస్సో కారుపై ఏప్రిల్ నెలలో ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది.
ఈసారి కంపెనీ మొత్తం సుమారు రూ. 37,500 వరకు లాభాన్ని కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో భాగంగా. రూ. 10,000 వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే పాత కారు మార్చుకుంటే రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. వాహనం స్క్రాప్ చేస్తే రూ. 25,000 వరకు అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఇక కార్పొరేట్ ఉద్యోగులకు అదనంగా రూ. 2,500 ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నారు. ఇలా అన్ని కలిపి చూసుకుంటే, ఇప్పటికే తక్కువ ధరలో ఉండే ఈ కారు ఇంకా బడ్జెట్‌లోకి దిగివచ్చింది.
25
రూ. 3 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకే
ఎస్-ప్రెస్సో ఎక్స్ షోరూమ్ ధర సాధారణంగా రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల మధ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆఫర్లతో ఈ ధర రూ. 3 లక్షల దగ్గరికి చేరే అవకాశం ఉంది. ఇది తక్కువ బడ్జెట్ ఉన్న వారికి పెద్ద అవకాశం. చిన్న ఫ్యామిలీకి సరిపోయే 5 సీటర్ కారు కావడంతో మధ్యతరగతి వారికి ఇది మంచి ఎంపికగా మారుతోంది.
35
రూ. 30 వేల జీతం ఉంటే ఎలా కొనొచ్చు?
ఒక సాధారణ ఉదాహరణ తీసుకుంటే. ఈ కారు ఆన్ రోడ్ ధర సుమారు రూ. 4.5 లక్షలుగా ఉందనుకుంటే. (వేరియంట్‌ను బట్టి మారుతుంది). డౌన్ పేమెంట్ రూ. 2 లక్షలు చెల్లిస్తే లోన్ మొత్తం రూ. 2.5 లక్షలు 9 శాతం వడ్డీతో తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మీరు 4 ఏళ్లకు గాను నెలకు సుమారు రూ. 6000 ఈఎమ్ఐ చెల్లిస్తే సరిపోతుంది. అంటే నెలకు రూ. 30 వేల జీతం ఉన్న వ్యక్తి కూడా తన ఖర్చులను బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కారును సులభంగా కొనుగోలు చేయగలడు. అయితే ఆ వ్యక్తి ఇతర ఈఎమ్ఐలు ఎలాంటివి లేకపోతేనే దీనిని బ్యాలెన్స్ చేయగలగడని గుర్తించుకోవాలి.
ఈ కారు పెట్రోల్, CNG రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మైలేజ్ సుమారు లీటర్‌కు 24.2 కిలోమీటర్లు ఇస్తుంది. అలాగే సీఎన్‌జీ కారు కిలోగ్రాముకు సుమారు 32.73 ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ కారులో STD (O), LXi (O), VXi (O), VXi (O)+ వంటి వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో టాప్ వేరియంట్లలో ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంధన ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి CNG మంచి ఎంపికగా చెప్పొచ్చు.
55
మొదటి కారుగా ఎందుకు బెస్ట్ ఎంపిక?
తక్కువ ధర, మంచి మైలేజ్, సులభమైన మెయింటెనెన్స్, సిటీ డ్రైవ్‌కు అనుకూలమైన సైజు ఇవి అన్నీ కలిపి చూస్తే, కొత్తగా కారు కొనాలనుకునే వారు, ముఖ్యంగా తక్కువ జీతం ఉన్న వారు కూడా ఈ కారును సులభంగా ప్లాన్ చేసుకునే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎయిర్ బ్యాగ్, మ్యూజిక్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉండడం కూడా ఈ కారు ప్రత్యేకతగా చెప్పొచ్చు.