Satya nadella: భ‌విష్య‌త్తులో ఐటీ ఉద్యోగాలు ఎలా ఉండ‌నున్నాయి.? మైక్రోసాఫ్ట్ సీఈఓ ఏం చెప్పారంటే

Published : Jun 10, 2025, 08:22 PM IST

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. దీంతో ఉద్యోగాల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. ఇలాంటి త‌రుణంలో ఐటీ రంగంలోకి రావాల‌నుకునే వారికి మైక్రోసాఫ్ట్ సీఈఓ కీల‌క సూచ‌న‌లు చేశారు.

PREV
15
కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల‌కు సూచ‌న

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు, ప్రత్యేకించి కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఒక కీలక సూచన చేశారు. ఆయన మాటల్లో, "ఏఐ టెక్నాలజీ ఎంతగా ముందుకెళ్లినా, ఒక మంచి టెక్నాలజీ నిపుణుడిగా ఎదగాలంటే బేసిక్ అంశాలపై పట్టు ఉండాల్సిందే" అని స్పష్టం చేశారు.

25
‘కంప్యూటేషనల్ థింకింగ్’

నాదెళ్ల మాట్లాడిన ముఖ్య అంశం కంప్యూటేషనల్ థింకింగ్. అంటే, సమస్యను భాగాలుగా విడగొట్టి, లాజిక్ ఆధారంగా పరిష్కారం కనుగొనడం. ఇది కోడింగ్ కంటే ముందు నేర్చుకోవాల్సిన నైపుణ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తత్వాన్ని అలవర్చుకుంటే ఏఐ ఉన్నా, లేకున్నా – కోడింగ్ లోతుగా అర్థం అవుతుంది. ప్రోగ్రామింగ్ భాష ఏదైనా కావచ్చు, కాని ఆలోచనా శైలి ఎప్పటికీ ఉపయోగపడుతుంది.

35
టెక్ యూట్యూబ‌ర్‌తో

ప్రముఖ టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన సంభాషణలో నాదెళ్ల తన అభిప్రాయాలను వెల్లడించారు. “ఏఐ ప్రపంచంలో కొత్తగా టెక్‌లోకి రావాలనుకునే వారికి మీరు నెంబర్ వన్ సలహా ఏమిటి?” అని ప్రశ్నించగా…

నాదెళ్ల స్పందిస్తూ, "సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే, మీరు సాఫ్ట్‌వేర్ ప్రాథమిక అంశాలను బాగా అర్థం చేసుకోవాలి. అది మీ అభివృద్ధికి బలమైన పునాదిగా ఉంటుంది" అని చెప్పారు.

45
ఏఐ పనిని సులభతరం చేస్తుంది కానీ… మార్గాన్ని చూపాల్సింది మనమే

ఏఐ టూల్స్ కోడ్ జనరేట్ చేయడంలో సహాయపడుతున్నా, అవి మన సూచనల మీదే ఆధారపడతాయి అని నాదెళ్ల వివరించారు. ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ కావాలంటే, సిస్టమ్స్ థింకింగ్, టెక్నికల్ విజన్ అవసరం. కోడ్ వ్రాయడం ఒక్కటే కాదు దానికి వెనక ఉన్న తీరు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడమే నిజమైన నైపుణ్యం అని అన్నారు.

55
భవిష్యత్‌లో ఎక్కువ మంది ‘సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్స్’గా మారతారు

సత్య నాదెళ్ల భావన ప్రకారం, భవిష్యత్ టెక్ ప్రపంచంలో మామూలు కోడింగ్ నిపుణుల కంటే ఆర్కిటెక్చరల్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లకే ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే, ఒక సిస్టమ్‌ను మొత్తం రూపకల్పన చేయగలగడం, దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం అనేది కోర్ స్కిల్ అవుతుంది. “తక్కువ సమయంలోనే మేమంతా సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్టులం కాబోతున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories