కేవలం పదో తరగతి పాసైతే చాలు.. రూ.37,000 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో జాబ్ మీదే

Published : May 22, 2025, 04:09 PM ISTUpdated : May 22, 2025, 04:10 PM IST

బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్లను నియమకాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సాలరీ ఎంత? అర్హతలేంటి? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
Bank of Baroda Jobs: Office Assistant - 500 Posts!

బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనేది చాలామంది యువతీ యువకుల కోరిక. వైట్ కాలర్ జాబ్ కావడం, హాయిగా ఏసీలో కూర్చుని చేసే పని కావడం,  టైమింగ్ ఫాలో అయ్యే జాబ్ కావడంతో చాలామంది బ్యాంకు జాబ్ ను ఇష్టపడతారు. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకుని మరీ బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.

24
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

ఇలాంటి తరుణంలో ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనుంది. ఇప్పటికే ఈ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీకి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు… ఆంధ్ర ప్రదేశ్ లో 22, తెలంగాణ 13 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా గుజరాత్ లో 80 పోస్టులున్నాయి. 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏ రాష్ట్రాల్లో ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేసుకుంటున్నారో అక్కడి స్థానిక భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

34
బరోడా బ్యాంక్ పరీక్ష ఎలా ఉంటుంది?

01.05.2025 నాటికి 18 నుంచి 26 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంది.

అర్హులైన వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ప్రాంతీయ భాష పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

44
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తుకు చివరి తేదీ 23.05.2025 (అంటే రేపు శుక్రవారం). కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.19,500 నుంచి రూ.37,815 వరకు జీతం లభిస్తుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవారు https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-office-assistant-in-sub-staff-cadre-on-regular-basis వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ వారికి రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 చెల్లించాలి.

Read more Photos on
click me!

Recommended Stories