Jobs: సాఫ్ట్‌వేర్ రంగంలో తుపాను రానుందా? ఏడాదిలో కోడింగ్ జాబ్స్ మాయం. ఇది చెప్పింది మరెవ‌రో కాదు

Published : Feb 10, 2026, 12:36 PM IST

Jobs: ఆంథ్రోపిక్.. ఇప్పుడు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. ముఖ్యంగా ఐటీ రంగానికి ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ టూల్ రాక‌తో ఐటీ షేర్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. కాగా తాజాగా ఈ కంపెనీ సీఈఓ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. 

PREV
15
టెక్ రంగంలో క‌ల‌క‌లం

ప్రపంచంలో అగ్రశ్రేణి AI కంపెనీల్లో ఒకటైన ఆంథ్రోపిక్‌ సంస్థ CEO డారియో amodi చేసిన వ్యాఖ్యలు టెక్ రంగంలో కలకలం రేపాయి. రాబోయే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చేసే చాలా పనులను AI చేయగలదని ఆయన చెప్పారు. ఈ మాటలు వేల మంది డెవలపర్లను ఆలోచనలో పడేశాయి.

25
డావోస్‌లో డారియో ఏమన్నాడు?

2026 జనవరిలో డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో డారియో మాట్లాడుతూ.. ఆంథ్రోపిక్‌లోని కొందరు ఇంజినీర్లు ఇప్ప‌టికే కోడ్ రాయడం మానేశారని తెలిపారు. ఏఐ కోడ్ రాస్తోంద‌ని, ఇంజ‌నీర్లు కేవ‌లం ఆ కోడ్‌ను చూసి మార్పులు చేస్తున్నార‌న్నారు. “AI సామర్థ్యం నెల‌ల వ్య‌వ‌ధిలోనే వేగంగా పెరుగుతోంది” అని ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో AI పెద్ద స్థాయిలో పరిశోధనలు కూడా చేయగలదని చె

35
టెక్ కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి?

ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు AIతో కోడ్ రాయిస్తున్నాయి. ముందు పెద్ద టీమ్‌లు అవసరమైతే, ఇప్పుడు ఒక AI మోడల్‌తో స‌రిపెట్టే పరిస్థితి వచ్చింది. Zoho వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా ఇదే విష‌య‌మై మాట్లాడుతూ.. “డెవలపర్లు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించాలి” అని సూచించారు.

45
నిజంగానే జ‌రుగుతుందా.?

ఏడాదిలో కోడింగ్ ఉద్యోగాలు మాయం కానున్నాయ‌న్న డారియో వ్యాఖ్య‌ల‌ను కొంతమంది టెక్ నిపుణులు ఖండిస్తున్నారు. డారియో చెప్పిన టైమ్‌లైన్ చాలా వేగంగా ఉందని అంటున్నారు. ఆంధ్రోపిక్‌లోని AI ఎక్కువ కోడ్ రాస్తున్నా, ఇతర కంపెనీల్లో అది ఇంకా తక్కువగానే ఉందని చెబుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం కొత్తగా కోడింగ్ నేర్చుకుని వచ్చే ఉద్యోగాలే ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి.

55
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పరిస్థితి ఎలా ఉంటుంది?

కోడింగ్ ఉద్యోగాలు పూర్తిగా పోవని నిపుణులు చెబుతున్నారు. కానీ పనితనం మాత్రం మారుతుంది. భవిష్యత్తులో డెవలపర్లు.. AI రాసిన కోడ్‌ను చెక్ చేయడం, పెద్ద సిస్టమ్‌ల డిజైన్ చేయడం, ప్రాజెక్ట్ ప్లానింగ్ వంటి పనులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే AI కోడింగ్ రంగాన్ని మార్చడం ఖాయం. ఇది నెమ్మదిగా కాకుండా చాలా వేగంగా జరుగుతోంది. కాబట్టి టెక్ రంగంలో ఉన్నవారు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, AIతో కలిసి పనిచేయడం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి, అప్పుడే మీ ఉద్యోగాల‌ను కాపాడుకోవ‌చ్చ‌న్న వాద‌న‌కు బ‌ల‌ప‌డుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories